జాతీయ వార్తలు

విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: విశ్వవిద్యాలయలలో రాజకీయ జో క్యం పనికిరాదని, వర్శిటి వ్యవహరాల్లో నేతలు జోక్యం చేసుకుని వాతావరణాన్ని కలుషితం చేయవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయు డు కోరారు. ఢిల్లీలో బుధవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాజకీయ అవసరాలకోసం విశ్వవిద్యాలయాలను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. దేశంకోసం పారాడిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో ఏర్పాటువాదులు, దేశద్రోహానికి పాల్పడిన వారితో కాంగ్రెస్ నాయకుల పోల్చడం ఏమిటని వెంకయ్య ప్రశ్నించారు.
వికలాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో సదుపాయాలు కల్పనకు మార్గదర్శకాలు విడుదల చేశామని వెంకయ్య చెప్పారు. ప్రజా రవాణా, విపత్తులు సంభవించినప్పడు బయటపడేందుకు, ఇళ్ళు శానిటేషన్ వినియోగంలో వికలాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. ఈ ప్రతిపాదనలను అన్ని రాష్ట్రాలకు పంపుతామని వెంకయ్య చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబందించిన రెండు పుస్తకాలను వెంకయ్య విడుదల చేశారు.

కాశ్మీర్‌లో పాక్
జెండాల రెపరెపలు
శ్రీనగర్, మార్చి 23: రాడికల్ మహిళా సంఘం దుఖ్తరన్ ఎ మిలాత్(డిఇఎం)కు చెందిన పలువురు కార్యకర్తలు బుధవారం పలుచోట్ల పాకిస్తాన్ జాతయ పతాకాలు ఎగరేశారు. పాకిస్తాన్ డే సందర్భంగా వారీ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీనగర్ నడిబొడ్డులోని చాల్‌చౌక్ సహా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పాక్ జెండాలు ఎగరేసినట్టు అధికారులు తెలిపారు. డిఇఎం కార్యకర్తలు సివిల్ లైన్స్‌లోనూ పాకిస్తాన్ జాతీయ పతకాలు ఎగరేశారు. అయితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వాటిని తొలగించారు. అసియా అంద్రాబీ నాయకత్వంలోని డిఇఎం రాడికల్ సంస్థ ప్రతి ఏటా పాకిస్తాన్ డే నాడు ఆ దేశం జాతీయ పతాకాలు ఎగరేస్తోంది. అలాగే ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ కార్యక్రమం నిర్వహిసున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న అసియాను గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు.
కొత్త షరతులకు
ససేమిరా
స్పష్టం చేసిన బిజెపి
బంతి పిడిపి కోర్టులోనే ఉంది
న్యూఢిల్లీ, మార్చి 23: జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి పిడిపి పెట్టే కొత్త షరతులకు అంగీకరించేదిలేదని బిజెపి స్పష్టం చేసింది. బంతి పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ కోర్టులోనే ఉందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన మెహబూబా ముఫ్తీ‘చర్చలు సానుకూలంగా,్ఫలప్రదమయ్యాయి’అని ప్రకటించిన నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ స్పందించారు.‘పిడిపి నుంచి ఎలాంటి కొత్త షరతులకు మేం ఆమోదం తెలపలేదు’ అని బుధవారం ఇక్కడ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో బిజెపి బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. మోదీ, మెహబూబా మధ్య సమావేశం మర్యాద పూర్వకంగా జరిగిందే తప్ప ప్రత్యేకమైన అంశాలేవీ చర్చకు రాలేదని రామ్‌మాధవ్ అన్నారు. ప్రధానితో సమావేశం సందర్భంగా మెహబూబా కూడా ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సరుూద్ మృతి తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. తమ పార్టీ అజెండా ప్రకారం రాజకీయ, ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన హామీని మెహబూబా ఆశిస్తున్నారు. ఇంతకు ముందే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పిడిపి అధినేత్రి సమావేశమైనా ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే ప్రధానితో సమావేశంపై మెహబూబా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.ప్రధానితో సమావేశం తరువాత పత్రికలతో మాట్లాడిన 56 ఏళ్ల మెహబూబా చర్చలు సానుకూలంగా సాగినట్టు ప్రకటించారు.