జాతీయ వార్తలు

మోదీ భజన మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశానికి దేవుడు ఇచ్చిన వరమంటూ బిజెపిలో వ్యక్తి పూజ చేయటం మంచిది కాదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సంస్థ ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం బిజెపి అధినాయకత్వానికి కరాఖండీగా చెప్పింది. బిజెపిలో రోజురోజుకు పెరిగిపోతున్న వ్యక్తి పూజ పట్ల ఆర్‌ఎస్‌ఎస్ తీవ్ర స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేసిందని అంటున్నారు. రాజస్తాన్‌లోని నాగోర్‌లో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి సభలో తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని దీన్‌దయాల్ పరిశోధనా సంస్థలో బిజెపి సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులు సురేష్ భయ్యాజీ జోషి, కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హోసబాలే, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సంస్థాగత వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి రాంలాల్, ఉపాధ్యక్షుడు వినయ్ శేషాద్రి హాజరయ్యారు. ఢిల్లీలో గత వారం జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తటం తెలిసిందే. భగవంతుడు ఈ దేశానికి ఇచ్చిన వరం నరేంద్ర మోదీ అంటూ ప్రశంసించారు. అంతటితో ఆగకుండా దేశంలోని బీద ప్రజలకు నరేంద్ర మోదీ దేవ దూత అని చెప్పటం ద్వారా బిజెపి జాతీయ కార్యవర్గానికి హాజరైన వారందరిని ఆశ్చర్యపరిచారు. వెంకయ్య పొగడ్తలకు బిజెపికి చెందిన కొందరు సీనియర్ నాయకులు తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ తమ అసంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం.
జాతీయ భావం అంశంపై ముందుకు సాగవచ్చు కానీ వ్యక్తి పూజకు అడ్డుకట్టవేయాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. మోదీ మూలంగా భారతదేశానికి గుర్తింపు వచ్చిందనటం వెనక ఉన్న అర్థం ఏమిటి? మోదీకి పూర్వం భారత దేశానికి గుర్తింపు, గౌరవం లేదా అని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం అమిత్ షాను అడిగినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీని ఇలా ఆకాశానికి ఎత్తటం వెనక ఉన్న అర్థం ఏమిటన్నది వారి ప్రశ్న. బిజెపి అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగిందని అంటున్నారు.
జాతీయ భావంపై బి.జె.పి జరుపుతున్న పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు. జాతీయ భావం, దేశ భక్తికి ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు దేశాభివృద్దిపై కూడా దృష్టి సారించాలి, అభివృద్ది గురించి ఎక్కువ మాట్లాడకుండా ఫలితాల సాధనను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం మోదీ ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు తెలిసింది. పథకాల ఫలితాలు ప్రజలకు చేరకపోతే మరోసారి విజయం సాధించటం కష్టమవుతుందని వారు సూచించారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జాతీయ భావంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వివరించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ప్రయత్నించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం సూచించినట్లు చెబుతున్నారు. జమ్ముకాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం గురించి, రిజర్వేషన్ల వివాదం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అంటున్నారు. రిజర్వేషన్ల వ్యవహారంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు రావటం వలన సంఘ్‌తోపాటు పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బ తింటోందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం రిజర్వేషన్ల అంశంపై ప్రకటనలు చేయకూడదని బిజెపి నాయకులు కోరినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్ల వ్యవహారం అంత్యంత సన్నితమైందనీ, దీనిపై ఎన్ని ప్రకటనలు వస్తే పార్టీకి అంత నష్టం కలుగుతుందని బిజెపి అధినాయకత్వం సూచించిందని అంటున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యులో కన్హయ్య కుమార్ అరెస్టు వ్యవహారంపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు.