జాతీయ వార్తలు

ఇక వేధింపుల భయం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: కళ్లముందు ప్రమాదం జరిగినా మనకెందుకులే అని తప్పించుకుపోయే వారికి రక్షణ కవచం లాంటి మార్గదర్శకాలు వచ్చాయి. తోటి మనిషిని ఆదుకునేవారిని ఏ విధంగానూ పోలీసులుగాని, అధికారులుగాని ఇతర కారణాలతో వేధించకుండా చూసే మార్గదర్శకాలను సుప్రీం కోర్టు బుధవారం ఆమోదించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జారీచేసిన వీటిని అత్యున్నత న్యాయస్థానం కూడా ఆమోదించడంతో ‘మనకెందుకుకులే’ అన్న ధోరణికి స్వస్థి పలికే రోజులు వచ్చినట్లే. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిర్లిప్త భావం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఎక్కడ సాయపడితే ఇటు పోలీసులు, అటు అధికారుల వేధింపులకు గురవుతామేమోనన్న భయంతో ఎవరూ కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి సుహృద్భావ స్వభావం కలిగిన ఆపదలో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న సద్భావన కలిగినవారికి ఈ మార్గదర్శకాలు రక్షణ కవచంగా నిలుస్తాయి. ఇలా ప్రమాదానికి గురైన వారిని ఆదుకునే వ్యక్తులు పోలీసుల వేధింపులకు గాని, అధికారుల వేధింపులకు గాని గురయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా వీటికి విస్తృత ప్రచారం కల్పించాలని, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటికి కుట్టుబడి ఉండేలా చేయాలని కూడా కేంద్రాన్ని ఆదేశించింది. అన్నింటికీ మించి బాధితులకు సాయపడే వ్యక్తి వివరాలను చాలా గోప్యంగా ఉంచాలని కూడా ఈ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నాయి.