జాతీయ వార్తలు

పనిచేయని వక్ఫ్‌బోర్డుల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్ర వక్ఫ్ బోర్డులు సక్రమంగా పనిచేయని పక్షంలో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తానని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెఫ్తుల్లా హెచ్చరించారు. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకున్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖానికి మసి పూయాలని కూడా ఆమె సూచించారు. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న ఎమ్మెల్యే ఆరిఫ్ అకీల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని కూడా మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ప్రతినిధులకు ఆమె సూచించారు. బుధవారం ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల చైర్‌పర్సన్లు, సిఈఓల జాతీయ సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొంతమంది బోర్డు సభ్యులు వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. సమావేశానికి ఢిల్లీ ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల వక్ఫ్ బోర్డు ప్రతినిధులు హాజరు కాకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ వర్గం వారికి సంబంధించిన సమస్యల పట్ల వారికి ఆసక్తి, చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
‘ఏదయినా ఒక వక్ఫ్ బోర్డు సక్రమంగా పని చేయకపోతే దాన్ని రద్దు చేసి కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాను. ఒక వేళ మీకు రాష్ట్ర అపభుత్వాలతో ఏదయినా సమస్య ఉంటే నాకు చెప్పండి, భయపడాల్సిన పని లేదు’ అని మేఘాలయ ప్రతినిధులు చేసిన ఫిర్యాదులపై స్పందిస్తూ నజ్మా అన్నారు. కాగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు కూడా అయిన అకీల్ 34 ఎకరాల వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నారని సమావేశంలో మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షౌకత్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. భోపాల్‌లోని ఆ ఆస్తి విలువ 500 కోట్ల రూపాయలుంటుందని కూడా ఆయన అంటూ, ఎమ్మెల్యేపై చర్య తీసుకునేలా రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి తేవాలని కోరారు. ఖాన్ ఫిర్యాదుపై మంత్రి స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్తానని అంటూ, ఈ లోగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని బోర్డు సభ్యులకు సూచించారు.