జాతీయ వార్తలు

తీవ్రవాదాన్ని అరికట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డులియజాన్ (అస్సాం), మార్చి 30: కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత గత 18 నెలల్లో దేశంలో తీవ్రవాదం గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయుధాలు విసర్జించి చర్చలకు రావాలని అస్సాంలోని అన్ని తీవ్రవాద సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక అస్సాంలో హింసాత్మక సంఘటనలు జరిగిన మాట వాస్తవమని, అయితే 2014లో మిలిటెంట్లు ఆదివాసీలను హతమార్చిన తరువాత తాను హుటాహుటిన గౌహతికి వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యానని, హింసను, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టంగా చెప్పామని వివరించారు. ‘ఆయుధాలను విసర్జించాలని, హింసామార్గాన్ని విడిచిపెట్టాలనే సందేశాన్ని కేంద్ర హోంమంత్రిగా అన్ని మిలిటెంట్ సంస్థలకు పంపాలనుకుంటున్నాను. ఒకవేళ వారికి ఏమైనా సమస్యలు ఉంటే హింసను విడిచిపెట్టి మాతో చర్చలకు రావాలి. మిలిటెంట్లు హింసామార్గాన్ని వీడి, అమాయకులను హతమార్చడాన్ని ఆపితేనే వారితో చర్చలు జరిపి అన్ని అంశాలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
చొరబాట్లను అడ్డుకుంటాం
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లతో పాటు పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ దేశంలోకి ప్రవేశించడం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై అదుపు తప్పుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అస్సాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చొరబాట్లను నిరోధించడంలో విఫలమయిందని ఆరోపించారు. పొరుగుదేశం నుంచి నకిలీ కరెన్సీ రావడాన్ని అరికడతామని చెప్పారు. చొరబాట్లను అడ్డుకోవడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం భారత్-బంగ్గా సరిహద్దును మూసివేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
బంగ్లాదేశ్ అవతరించినప్పటి నుంచి ఆ దేశంనుంచి అస్సాంలోకి నిరంతరం చొరబాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయినప్పటికీ మీరు ఈ చొరబాట్లను ఎందుకు నిరోధించలేదు? అని ఆయన కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. భారత్-బంగ్లా సరిహద్దును ఎందుకు పూర్తిగా మూసివేయలేదని ప్రశ్నించారు. ఈ చొరబాట్లను నిరోధించడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కొద్ది నెలల క్రితం తాను భారత్-బంగ్లా సరిహద్దులను సందర్శించానని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపానని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఎవరూ అస్సాంలోకి చొరబడకుండా ఉండేందుకు సరిహద్దులను మూసివేయడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.