జాతీయ వార్తలు

పిటిషన్ ఉపసంహరించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హౌసింగ్ పాలసీ మార్పునకు అనుమతి ఇచ్చింది. విచారణలో ఉన్న పిటిషన్ ఉపసంహరించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసు అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే హైకోర్టు ఇళ్లస్థలాలు ఇదివరకు ఉన్నవారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు ఈ కేసును తాము ఉపసంహరించుకొంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరగా ఆంధ్రప్రదేశ్ తరఫున్యాయవాది, సొసైటీల తరపు న్యాయవాది వ్యతిరేకించారు. దీంతో సుప్రీంకోర్టు తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి నిరాకరించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విధానంలో మార్పులకు అవకాశం ఇవ్వాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌ను విచారణలో ఉన్న కేసులో ప్రతివాదిగా చేరుస్తూ, అందరి వాదనలు అందిన తరువాత కేసు విచారణ కొనసాగించనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.