జాతీయ వార్తలు

ఎల్‌పిజి పంపిణీలో పేద మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: దీపం పథకం కింద ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లలో తెలంగాణలోని పేద మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశమైన ఇద్దరు మంత్రులు పెట్రోలియం ఆథారిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బండారు విలేఖరులతో మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్‌లోని సిఎన్‌జి గ్యాస్ స్టేషన్ల పెంచాలని ప్రధాన్‌కు విజ్ఞప్తి చేసినట్టు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కాగా పెట్రోలియం మంత్రి మాట్లాడుతూ 2016-17లో కోటిన్నర మంది పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 1తేదీ నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్ల ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. భాగ్యనగర్ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సిఎన్‌జి గ్యాస్ స్టేషన్లు పెంపుఅంశంపై అధికారులతో చర్చిస్తామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పెట్రోఉత్పత్తుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
సెప్టెంబర్ 2న దేశవ్యాప్త
సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 30: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబరు 2 నాడు కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కార్మిక సంఘాల సమావేశానికి పదకొండు సంఘాలు నేతలు హాజరై కార్మికుల సమస్యలు, తీసుకురావల్సిన సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించారు. నిరుద్యోగులకు ఉద్యోగకల్పన ,కనీస వేతనాలు సహా పనె్నండు డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు విమర్శించాయి.