జాతీయ వార్తలు

అడ్డుకుంటే ఆరు నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: ప్రార్థనా స్థలాల్లోకి మహిళలు ప్రవేశించకూడదని ఏ చట్టం చెప్పడం లేదని, పురుషులు ప్రవేశించే అన్ని ప్రార్థనా స్థలాల్లోకి మహిళలను కూడా అనుమతించాలని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఏ దేవాలయమైనా లేదా వ్యక్తి అయినా మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తే మహారాష్టల్రోని ఒక చట్టం కింద ఆరు నెలల జైలుశిక్షను ఎదుర్కోవలసి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్.వాఘేలా, న్యాయమూర్తి ఎం.ఎస్.సోనక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని శని శింగనాపూర్ దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలను సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది నీలిమ వార్తక్, సామాజిక కార్యకర్త విద్యాబాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఏ ప్రార్థనా స్థలంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే ఎలాంటి చట్టం లేదు. పురుషులను అనుమతిస్తే మహిళలను కూడా అనుమతించాల్సిందే. పురుషులు లోనికి వెళ్లి దేవుడికి మొక్కుకోగలిగినప్పుడు మహిళలను అలా ఎందుకు మొక్కుకోనివ్వరు? మహిళల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి’ అని ప్రధాన న్యాయమూర్తి వాఘేలా అన్నారు. ‘ఒకవేళ దేవుడి పవిత్రతకు సంబంధించి మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, దాని గురించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయనీయండి. మహారాష్ట్ర హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ (ఎంట్రీ ఆథరైజేషన్) యాక్ట్- 1956 ప్రకారం ఎవరయినా దేవాలయంలోకి ఎవరినయినా ప్రవేశించనీయకపోతే అడ్డుకున్న వ్యక్తి ఆరు నెలల జైలుశిక్షను ఎదుర్కోవలసి వస్తుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని హైకోర్టు పేర్కొంది. శని శింగనాపూర్ దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తారా? లేదా? అనే అంశంపై శుక్రవారం (ఏప్రిల్ ఒకటో తేది)లోగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ప్రభుత్వ న్యాయవాది అభినందన్ వాగ్యానిని హైకోర్టు ఆదేశించింది.