జాతీయ వార్తలు

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను బిజెపి మరోసారి తెరపైకి తేనుంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రస్తావన తేవడంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఏటా జరుగుతూ ఉండడం సంక్షేమ పథకాల అమలుకు అడ్డుగా మారుతోందని ఈ నెల 19న జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మోదీ అన్నట్లు పార్టీ నాయకుడొకరు చెప్పారు. అంతేకాదు, అయిదేళ్లకోసారి లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని అనుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు. ఒకదాని తర్వాత ఒకటిగా వరసగా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియ తరచూ ఆగిపోతోందని మోదీ అభిప్రాయ పడినట్లు ఆ నాయకుడు చెప్పారు. అంతేకాదు, లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజా ధనం కూడా బోలెడంత ఆదా అవుతుందన్నారు. గతంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ చేసిన ఈ ప్రతిపాదనకు వివిధ పార్లమెంటు కమిటీలు, చివరికి లా కమిషన్‌నుంచి కూడా మద్దతు లభించింది. ఇటీవలి బడ్జెట్ సమావేశానికి ముందు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం అనధికారికంగా ఈ ఆలోచనను ప్రతిపాదించిందని బిజెపి వర్గాలు తెలిపాయి. సమావేశం అజెండాలో అది లేకపోయినప్పటికీ అనధికారికంగా చర్చకు చేపట్టారని, కొన్ని పెద్ద పార్టీలనుంచి కూడా మద్దతు లభించిందని పార్టీ వర్గాలు అంటూ, అయితే అధికారికంగా ప్రతిపాదించినప్పుడు వాటి వైఖరి ఎలా ఉంటుందో తెలియదన్నాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని న్యాయ, సిబ్బది వ్యవహారాలకు చెందిన పార్లమెంటు స్థారుూ సంఘం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో గట్టిగా కోరింది. అంతేకాదు సమీప భవిష్యత్తలోనే ఆ పని చేయవచ్చని కూడా కమిటీ అభిప్రాయ పడింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా మద్దతు తెలిపింది. అయితే స్థారుూ సంఘం పంపిన ప్రశ్నావళిపై స్పందించిన రాజకీయ పార్టీలు మాత్రం ఇది ఎంతో మంచి ఆలోచన అని అంటూనే, అమలు చేయడం కష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం.