జాతీయ వార్తలు

మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 3: ఉగ్రవాదం మానవత్వానికే శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంతో మతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో రంగాలవారీ లేదా పాక్షిక వైఖరులు ఏమాత్రం సమర్థవంతంగా పని చేయవని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాటం జరపాలని మోదీ స్పష్టం చేస్తూ, మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అనే తేడా ఏదీ ఉండకూడదని, దానికి కులం, రంగు, తెగ, లేదా మతంలాంటివేవీ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సౌదీ అరేబియా పోషిస్తున్న పాత్రను ప్రధాని ప్రశంసిస్తూ, ప్రపంచం నివసించడానికి మెరుగైన, సురక్షితమైన ప్రాంతంగా ఉండేలా చూడడానికి సౌదీ అరేబియాతో, ఈ ప్రాంతంలోని దాని భాగస్వాములతో కలిసి పని చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు జరుపుతున్న కృషి ఒక ప్రాంతానికి లేదా మతానికి వ్యతరేకంగా చేస్తున్నది కాదన్న విషయం ఉగ్రవాదులకు తెలిసేలా చేయాలని భారత్ భావిస్తోందని మోదీ చెప్పారు. ఈ విషయంలో ఉగ్రవాదంపై పోరులో ఈ ప్రాంతంలో సౌదీ అరేబియా పోషస్తున్న నాయకత్వ పాత్రను తాము ఎంతో ప్రశంసిస్తున్నామని సౌదీలో తన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రముఖ దినపత్రిక ‘అరబ్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని చెప్పారు. ఇస్లాం మతానికి ఆధ్యాత్మిక కేంద్రమైన సౌదీ అరేబియా ఉగ్రవాదంపై ముఖ్యంగా ఐసిస్‌పై పోరాటం జరపడానికి ఇటీవలే 34 ముస్లిం దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. భారత్, సౌదీ అరేబియాలకు ఒక ఉగ్రవాద నిరోధక యంత్రాంగం కూడా ఉంది. ‘ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మానవత్వం పట్ల నమ్మకం ఉన్న అందరూ ఒక్కటి కావాలి. మతాన్ని ఉగ్రవాదంనుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని సమగ్రమైన రీతిలోనే ఎదుర్కోవాలి. విభాగాల వారీగా, లేదా పాక్షికమైన వైఖరులు ఎంతమాత్రం ఫలతమివ్వవని చారిత్రకంగా రుజువు అయింది’ అని మోదీ అన్నారు. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అనే తేడా ఏదీ ఉండకూడదని సౌదీ అరేబియాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన పాకిస్తాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ అన్నారు. ఉగ్రవాద చర్యకు ఏ కారణం కూడా సమర్థనీయం కాదని భారత్, సౌదీ అరేబియాలు గుర్తించాయని ప్రధాని అంటూ, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి సహకరించుకోవడంలో భారత్, సౌదీ అరేబియాలు సన్నిహితమైనాయని చెప్పారు.

చిత్రం... రియాద్‌లోని టిసిఎస్ కంపెనీ ఐటి మహిళా విభాగాన్ని సందర్శించి ఉద్యోగినులతో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ