జాతీయ వార్తలు

ఎన్‌ఐఎ అధికారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజ్‌నోర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సహా అనేక టెర్రరిస్టు దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి ఒకరు ఆదివారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఎన్‌ఐఎ దర్యాప్తు విభాగంలో పనిచేస్తున్న అధికారి మొహమ్మద్ టాంజిల్ అహ్మద్ (45)పై అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు.
కాల్పుల్లో ఆయన మృతి చెందగా, ఆయన భార్య ఫర్జానా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా సహాస్‌పూర్ గ్రామంలో నివాసముంటున్న అహ్మద్ ఇదే జిల్లాలోని సొహారా గ్రామంలో శనివారం జరిగిన తన మేనకోడలి వివాహానికి హాజరయి, తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. వాగన్-ఆర్ వాహనంలో కుటుంబ సభ్యులతో తిరిగి వస్తున్న అహ్మద్ 12.45 గంటల సమయంలో తన ఇంటికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉండగా అతని వాహనాన్ని ఆపిన దుండగులు సమీపం నుంచి 24 రౌండ్ల కాల్పులు జరిపి, అక్కడినుంచి పారిపోయారు. వెనుక సీట్లో కూర్చున్న 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు చూస్తుండగానే అహ్మద్, అతని భార్యపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో అహ్మద్ కుమార్తె, కుమారుడికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను వెంటనే సమీపంలోని కాస్మోస్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఫర్జానాను నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించారు. ఎన్‌ఐఎ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, తరువాత దర్యాప్తు విభాగంలోకి మారిన అహ్మద్‌పై దుండగులు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని ఎన్‌ఐఎ ఐజి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాదులే కాల్పులకు తెగబడ్డారనే కోణాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. దుండగులు 9ఎంఎం పిస్టల్‌ను కూడా ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అహ్మద్ కదలికలపై కనే్నసిన దుండగులు పక్కా ప్రణాళికతోనే ఈ దారుణానికి ఒడి గట్టారని పోలీసులు భావిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ అహ్మద్ దారుణ హత్య సమాచారం తనకు అందిందని, దీనిపై తదుపరి తీసుకోవలసిన చర్యల గురించి ఎన్‌ఐఎ అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు బిజ్నోర్ జిల్లా సరిహద్దులను మూసివేసి కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని అదనపు డిజిపి దల్జీత్ చౌదరి పేర్కొన్నారు.

చిత్రం... దాడికి గురైన టాంజిల్ కారును పరిశీలిస్తున్న భద్రతా బలగాలు. ఇన్‌సెట్‌లో హత్యకు గురైన టాంజిల్