జాతీయ వార్తలు

‘భరత్ మాతాకీ జై’ అనని వాళ్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, ఏప్రిల్ 3: ‘్భరత్ మాతాకీ జై’ అనడానికి ఇష్టపడని వారికి దేశంలో ఉండడానికి ఎలాంటి హక్కూ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ‘్భరత్ మాతాకీ జై’ అనడంపై ఇప్పటికీ వివాదం ఉంది. అలా అనడాన్ని వ్యతిరేకిస్తున్నవారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఇక్కడ ఉండేవారు ‘్భరత్ మాతాకీ జై’ అని అనాల్సిందే’ అని ఫడ్నవిస్ శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో అన్నారు. జాతీయతా వాదంపై ఓ వైపు వివాదం కొనసాగుతూ ఉండగా ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలతో ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారిని సమర్థించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు బిజెపికి వ్యతిరేకంగా తమ నిరనను తెలియజేయవచ్చు కానీ ‘్భరత్ మాతాకీ జై’ నినాదాన్ని వ్యతిరేకించరాదని ఫడ్నవిస్ అంటూ, దేశ ప్రజలు దాన్ని సహించరని హెచ్చరించారు. రాష్ట్రంలోని శనిసింగనాపూర్‌లాంటి కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం లేకపోవడంపై జరుగుతున్న చర్చ గురించి మాట్లాడుతూ, హైందవ సంస్కృతి ప్రకారం స్ర్తి పురుషుల మధ్య కానీ, కులాల మధ్య కానీ ఎలాంటి వివక్షా లేదని, అందువల్ల ఏ ఆలయంలో కూడా మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించకూడదని ఫడ్నవిస్ అన్నారు.
కాగా, ప్రత్యేక విదర్భ, మరాఠ్వాడా పేరుతో ఈ ప్రాంతాల వారికి, మిగతా మహారాష్ట్ర వాసులకు మధ్య వివాదాన్ని సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఏ పార్టీ, నాయకుడి పేరును ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి అన్నారు.

మరాఠ్వాడా ప్రాంతానికి నాసిక్ డ్యామ్ నీటిని విడుదల చేయడంపై నిరసనలు వ్యక్తమవడాన్ని ప్రస్తావిస్తూ మరాఠ్వాడా ప్రాంత ప్రజలు మంచినీటి కొరతతో అల్లాడుతున్నందున వారికి మంచినీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
అంతకుముందు నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది కుంభమేళాను చక్కగా నిర్వహించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, నాసిక్ జిల్లా ఇన్‌చార్జి అయిన గిరీష్ మహాజన్ పాత్రను ముఖ్యమంత్రి ప్రశంసించారు. కుంభమేళాకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు కేటాయించడంతో పాటుగా 105 కిలోమీటర్ల రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసిందని సిఎం చెప్పారు.