జాతీయ వార్తలు

దేశీయ పరిజ్ఞానంతోనే చంద్రయాన్-2 - ఇస్రో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తొలిసారి చేపట్టిన చంద్రగ్రహ యాత్ర చంద్రయాన్ ప్రయోగంలో రష్యా సాయాన్ని తీసుకున్న భారత్ చంద్రయాన్-2 ప్రయోగంలో మాత్రం రష్యా సాయాన్ని తీసుకోకూడదని, ఈ ప్రయోగాన్ని దాదాపు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే చేపట్టాలని, అయితే అమెరికానుంచి కొద్దిపాటి సాయాన్ని మాత్రం తీసుకోవాలని నిర్ణయించుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లాండర్, రోవర్ కలిగి ఉండే చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని 2007 డిసెంబర్ నెలలో కానీ, 2018 తొలి అర్ధ్భాగంలో కానీ ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ చెప్పారు. చంద్రుడిపై శాంపిల్స్ సేకరించి, భూమికి డేటాను పంపించే పరికరాలు కూడా ఈ ఉపగ్రహంలో ఉంటాయి. ఇస్రో చేపట్టిన రోదసీ యాత్రల సిరీస్‌లో చంద్రయాన్ ఒకటి. తాను తొలిసారిగా చేపట్టిన చంద్రగ్రహయాత్ర చంద్రయాన్-1 ప్రయోగంలో చంద్రుడిపైన నీరు ఉన్నట్లు ఓ ముఖ్యమైన అంశాన్ని ఇస్రో కనుగొన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగంలో రష్యాను పక్కన పెట్టి, అమెరికానుంచి స్వల్పంగా సాయం తీసుకొని దాదాపుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని ఇస్రో నిర్ణయించుకుంది. చంద్రుడిపై దిగే లాండర్‌కు రష్యా అంతరిక్ష పరిశోధన ఏజన్సీ ‘రాస్‌కాస్మోస్’ బాధ్యురాలిగా ఉండాలని, ఇస్రో చంద్రుడి చుట్టూ పరిభ్రమించే రోవర్‌కు, అలాగే జిఎస్‌ఎల్‌వి ద్వారా జరిపే ప్రయోగానికి బాధ్యురాలిగా ఉండాలని 2010లో నిర్ణయించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రోగ్రామ్‌లో జరిగిన మార్పుల కారణంగా చంద్రుడిపై దిగే లాండర్ అభివృద్ధిని ఇస్రోయే చేపట్టాలని, చంద్రయాన్-2 మిషన్ పూర్తిగా స్వదేశీయమైనదిగానే ఉండాలని నిర్ణయించారు. ‘రష్యా లాండర్‌కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, మరికొన్ని పరీక్షలు జరపాల్సిన అవసరముందని వాళ్లు చెప్తున్నారు. ఈలోగా దాన్ని పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేయాలని మేము నిర్ణయించకున్నాం’ అని ఇస్రోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పూర్తి స్వదేశీయమే అయినప్పటికీ ఇస్రో ఈ ప్రాజెక్టుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సేవలను తీసుకుంటోంది. ‘ఉపగ్రహ గమనాన్ని ఒకే ప్రాంతంనుంచి గమనించలేము. అందువల్ల ఇతర ప్రాంతాల సాయం అవసరం. చంద్రయాన్‌కు సంబంధించి అమెరికా సహకారం దాని డీప్‌స్పేస్ నెట్‌వర్క్ ద్వారా సేవలందించడానికే పరిమితం. ఈ ప్రాజెక్టులో మేము రష్యా సహాయాన్ని ఉపయోగించుకోవడం లేదు’ అని కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఇస్రో, నాసాల మధ్య సహకారం పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చంద్రయాన్-2 విషయంలో రష్యా సహకారాన్ని తీసుకోకపోయినప్పటికీ ఇస్రో పలు ప్రాజెక్టుల విషయంలో రష్యా సహకారాన్ని తీసుకుంటోంది.