జాతీయ వార్తలు

‘అవినీతే’ ప్రధాన ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 3: పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అవినీతి ప్రధాన అంశంగా మారింది. సోమవారం నుంచి ఆరు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘అవినీతి’ కేంద్ర బిందువుగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తృణమూల్ సర్కార్‌లో స్కాములు, కుంభకోణాలు వెలుగుచూడటంతో ప్రతిపక్షాలు అవినీతినే ప్రధానాంశంగా ప్రచారం చేశాయి. శారదా కుంభకోణంలో భారీ ఎత్తున అక్రమాలు వెలుగుచూడటం, అధికార టిఎంసి మంత్రులు, నేతల పాత్ర బయటపడటంతో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి అవినీతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కన్నా బలంగా వేళ్లూనుకున్న అవినీతిపైనే ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇప్పటివరకు బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ అవినీతి అంశం ప్రస్తావనకు రాలేదని, అధికారంలో ఉన్న ఏ పార్టీ ఇంతగా కుంభకోణాల ఊబిలో చిక్కుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత్ మిశ్రా వెల్లడించారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం అప్పటి సిద్ధార్థ శంకర్ రే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం జరిపామని తెలిపారు. కానీ తృణమూల్ అధికారంలోకి వచ్చిన అనంతరం అవినీతి పెచ్చరిల్లిపోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. హక్కుల పునరుద్ధరణ, నిరుద్యోగం వంటి ఎన్నో తీవ్ర సమస్యలను అవినీతి అధిగమించిందని మిశ్రా ఆరోపించారు. అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, అవినీతి ఆరోపణలతో సాక్షాత్తూ ఓ మంత్రి అరెస్టు కావడం బెంగాల్ చరిత్రలో ప్రథమమని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, ప్రతిపక్షాలు వాటినే ప్రచారాస్త్రంగా ప్రయోగించడంతో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దీటుగానే బదులిచ్చారు. శారదా కుంభకోణం పాపం ఈనాటిది కాదనీ, లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఊపిరి పోసుకుందని మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించారు. తన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికే జరిగిన కుట్రలో భాగంగానే ఆ పాపాన్ని తమపై నెడుతున్నారని ఆరోపించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుంభకోణానికి సూత్రధారులను అరెస్టు చేసి జైలుకు పంపించామని, అవినీతిని అంతమొందించడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ అసలు సిసలు నిజాయితీ కలిగిన పార్టీ అని మమత చెప్పుకున్నారు. ఏదిఏమైనా, సోమవారం నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారనేది ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడికానుంది.

బంకురా జిల్లాలో ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

కెనడాలో సిక్కు యువకుడిపై దాడి

టొరంటో, ఏప్రిల్ 3: కెనడాలో 29 ఏళ్ల సిక్కు యువకుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. జాతి వివక్షే కారణంగా భావిస్తున్న ఈ సంఘటనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన సుప్నిందర్ సింగ్ ఖేహ్రా టొరాంటో నగర శివార్లలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. తాను క్యూబెక్ సిటీ ప్రాంతంలో స్నేహితులతో బైటికి వెళ్లి చీకటి పడ్డంతో టాక్సీని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఒక కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తనను ఫ్రెంచ్ భాషలో తిట్టడం ప్రారంభించారని, తన తలపాగా (టర్బన్)ను చూపిస్తూ బూతులు తిట్టసాగారని గాయాలనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఖేహ్రా చెప్పాడు. తన కంటిపై గట్టిగా కొట్టడంతో తాను కిందపడిపోయానని, కిందపడిపోయిన తనను పదే పదే తన్నారని అతను చెప్తూ, తానుభారతీయుడ్ని కావడం, నల్లగా ఉండడం, టర్బన్ ధరించి ఉండడమే దీనికి కారణమని చెప్పాడు. తనపై దాడి చేసిన అందరూ మద్యం మత్తులో ఉన్నారని కూడా అతను చెప్పాడు. కాగా, అణు భద్రతపై అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వాషింగ్టన్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ సంఘటనను ఖండించారు. కెనడాలో ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు స్థానం లేదని ఆయన అన్నారు.

వరల్డ్ సిఖ్ సంస్థ కెనడా డైరెక్టర్ జస్కరణ్ సంధు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దోషులను శిక్షిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరిని ప్రశ్నించిన అనంతరం వదిలిపెట్టారు.