జాతీయ వార్తలు

మానవ వనరుల్లో మహిళలది కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 3: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రియాద్‌లో అందరూ మహిళలే ఉండే టిసిఎస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శంచి అక్కడ పని చేస్తున్న సౌదీ మహిళా ఐటి ఉద్యోగులతో మాట్లాడారు. అంతేకాదు, వారిని భారత్‌కు రావలసిందగా కూడా ఆహ్వానించారు. ‘సౌదీ అరేబియా కీర్తికి ప్రతినిధులైన ఈ ఐటి ఉద్యోగినులతో నేను ఈ రోజు మాట్లాడడం ప్రపంచానికి ప్రధాన వార్త అవుతుంది’ అని టిసిఎస్ ట్రైనింగ్ సెంటర్‌లోని మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ మోదీ అన్నారు. మోదీకి టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్ర్తి, టిసిఎస్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్‌లు స్వాగతం పలికారు. మోదీ సెంటర్‌లో దాదాపు నలభై నిమిషాలు గడపడమే కాకుండా ఉద్యోగినులతో సెల్ఫీలు దిగారు. టిసిఎస్ ట్రైనింగ్ సెంటర్‌లో వెయ్యి మందికి పైగా మహిళలు బిపిఓ కార్యకలాపాల్లో పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 85 శాతం మంది సౌదీ మహిళలే కావడం విశేషం. నేటి పోటీ ప్రపంచంలో మనం పురోగమించాలంటే అన్ని శక్తులు కలిసి పురోగమించాలని, శక్తులు అంటే సహజ వనరులు మాత్రమే కాదన మానవ వనరులు కూడానని అన్నారు. మానవ వనరుల్లో మానవ శక్తి కీలకపాత్ర పోషిస్తుందని, మహిళల సామర్థ్యాన్ని గనుక పెంపొందించి, దాన్ని అభివృద్ధి ప్రక్రియతో అనుసంధానం చేయగలగితే ఏ దేశం అభివృద్ధి అయినా ఊహించనంత వేగం అందుకుంటుంది’ అని మోదీ అన్నారు. భారత్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే నరేంద్ర మోదీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసిందిగా ప్రధాని వారికి చెప్పారు. రియాద్‌లోని తమ సెంటర్‌కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని టిసిఎస్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖరన్ చెప్పారు. రియాద్‌లో ఈ సెంటర్‌ను 2013లో ఏర్పాటు చేశారు.

రియాద్‌లోని టిసిఎస్ కేంద్రానికి విచ్చేసిన ప్రధానికి జ్ఞాపికను అందజేస్తున్న
టిసిఎస్ గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తీ, సిఇఓ ఎన్. చంద్రశేఖరన్