అంతర్జాతీయం

‘పనామా’దెబ్బ.. ఐస్‌లాండ్ ప్రధాని రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిక్‌జావిక్, ఏప్రిల్ 5:పనామా పత్రాల ప్రకంపనలకు తొలి వికెట్ పడింది. లక్షలాది డాలర్ల మొత్తాన్ని అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐస్‌లాండ్ ప్రధాని సిగ్‌ముందర్ డేవిడ్ రాజీనామా చేశారు. బ్రిటీష్ వర్జీనియా దీవుల్లో డేవిడ్‌కు, ఆయన భార్యకు ఓ బూటకపు కంపెనీ ఉందని, దానికి లక్షలాది డాలర్ల మేర దేశీయ ధనాన్ని తరలించారంటూ పనామా పత్రాల్లో వెల్లడైంది.తానేతప్పు చేయలేదని డేవిడ్ చెబుతున్నా..రాజకీయ వత్తిళ్ల కారణంగా రాజీనామా చేయక తప్పలేదు. లక్షలాది డాలర్లను దేశం నుంచి తరలించారన్న ఆరోపణలతో గగ్గోలెత్తిన ప్రజలు ప్రధాని డేవిడ్ రాజీనామా చేయాలంటూ ప్రదర్శనలు జరిపారు. కోడిగుడ్లనూ విసిరారు. పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. డేవిడ్ స్థానే ప్రధాన మంత్రి పదవిని తాను చేపట్టబోతున్నట్టు అధికార ప్రగతిశీల పార్టీ ఉప నాయకుడు జోహన్సన్ ప్రకటించారు. ఎందరో ప్రముఖుల పేర్లను పనామా పత్రాలు బయట పెట్టినప్పటికీ వాటి ప్రభావానికి ఓ దేశ ప్రధాని రాజీనామా చేయడం దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది. పనామా పత్రాలు కట్టుకథలు కావని, నల్ల కుబేరుల జాతకాల చిట్టాయేనని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమి కావాలి?