అంతర్జాతీయం

నేతల్లో గుబులు.. దర్యాప్తు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఏప్రిల్ 5: ‘పనామా’ ప్రపంచాన్ని వణికిస్తోంది. వివిధ దేశాల్లో దేశాధ్యక్షులతో సహా రాజకీయ నాయకులు, ప్రముఖులు పన్ను ఎగవేసి అడ్డదారి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు లీకయిన నేపథ్యంలో స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు మంగళవారం విచారణకు ఆదేశించాయి. దీంతో వివిధ దేశాల నేతలు,ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొసాక్ ఫానె్సకా న్యాయ సంస్థ దర్యాప్తు ద్వారా కోటీ పదిహేను లక్షల డాక్యుమెంట్లలో వివిధ దేశాధి నేతలతో సహా పలువురు ప్రముఖుల బండారం సోమవారం బయటపడిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా నేత జీ జిన్‌పింగ్ బంధువులు, బార్సెలోనా స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ, ఐస్‌లాండ్ ప్రధానమంత్రి సిగ్‌ముందర్ డేవిడ్ గున్లాగ్‌సన్ వంటి విదేశీ ప్రముఖులు ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. ‘‘మనీలాండరింగ్ స్కాంపై దర్యాప్తు ప్రారంభించాం’’ అని స్పెయిన్ జాతీయ న్యాయస్థానంలో వెల్లడించినట్లు మొ సాక్ ఫానె్సకా వర్గాలు తెలిపాయి. సోమవారం లీకయిన డాక్యుమెంట్లలో సాకర్ ఆటగాడు మెస్సీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత, స్పె యిన్ డైరెక్టర్ పెడ్రో అల్మోదోవర్‌ల పేరూ ప్రముఖంగా బయటకు వచ్చింది. అటు మొసాక్ ఫానె్సకా ద్వా రా లీకైన వారిలో ఎనిమిది వందల మందిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆస్ట్రేలియా పేర్కొంది. అటు ఫ్రాన్స్ ప్రాసిక్యూటర్లు, నెదర్లాండ్స్ పన్నుల విభాగం అధికారులు కూడా ఈ వ్యవహారంపై న్యాయవిచారణ మొదలుపెట్టినట్లు ప్రకటించారు. ‘‘పనామా’’ పేపర్లుగా ప్రసిద్ధి చెందిన ఈ డాక్యుమెంట్లు జర్మన్ పత్రిక జీటంగ్ ద్వారా లీక్ కావటమే కాకుండా అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల సంస్థ (ఐసీఐజే) ద్వారా వందకు పైగా మీడియా గ్రూపుల్లో షేర్ కావటం సంచలనం సృష్టించింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలకమైన అంశాలు బయటపెడతామనీ ఐసీఐజే పేర్కొం ది. ప్రధానంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘పుతిన్ సన్నిహిత అనుచర గణం ద్వారా దాదాపు రెండు వందల కోట్ల డాలర్లు బ్యాంకులు, దొంగ కంపెనీల ద్వారా రహస్యంగా తరలించారు’’ అని ఐసీఐజే తెలిపింది.
మేమేం తప్పు చేయలేదు:
పారిస్: పనామా పేపర్ల లీకేజీతో దేశ విదేశాల్లో మూకుమ్మడిగా ఖండనలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ డాక్యుమెంట్లు వెలువడిన వెంటనే క్రెమ్లిన్ సహా అన్ని దేశాల నుంచి ఖండనలు వెల్లువెత్తాయి. ఇదంతా అమెరికా కుట్ర అని కూడా పుతిన్ అనుచరులు ఆరోపించారు. ఈ ఆరోపణలను క్రెమ్లిన్ ప్రతినిధి మిత్రి ప్సెకొవ్ ఖండిస్తూ రష్యాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అస్థిరతను సృష్టించేందుకే పుతిన్‌పై ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. సాకర్ ఆటగాడు మెస్సీ కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. మెస్సీ ఎలాంటి పన్ను ఎగవేతకు కానీ, మనీ లాండరింగ్‌కు కానీ పాల్పడలేదని స్పష్టం చేశారు. అయితే మెస్సీ ఇప్పటికే పన్ను ఎగవేత ఆరోపణలను మరో కేసులో ఎదుర్కొంటున్నాడు. చైనా అధినేత జి జిన్‌పింగ్‌పై వచ్చిన ఆరోపణలను అక్కడి ప భుత్వం అధికారికంగా ఖండించలేదు.