జాతీయ వార్తలు

కోహినూర్ తెచ్చేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: బ్రిటన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే విషయయంలో మీ ఉద్దేశం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఒకప్పుడు భారత్‌కు తరగని వనె్నతెచ్చిన కోహినూన్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంది. 105 కేరెట్ల కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అతిపెద్దది. అరుదైన వజ్రాన్ని భారత్‌కు తీసుకురావడంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందంటూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. వజ్రం రప్పించే విషయంలో కేంద్రం ఏ మాత్రం శ్రద్ధచూపడం లేదని పిటిషనర్ ఆరోపణ. శుక్రవారం పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ధర్మాసనం వజ్రాన్ని రప్పించడంలో ఏ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా కోహినూర్ వజ్రం తమదేనంటూ ప్రయత్నాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సుప్రీం పేర్కొంది. కాగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వడం కుదరదని గతంలోనే తేల్చిచెప్పారు. కోహినూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్నందున ఇవ్వడం వీలుపడదని తెలిపారు. అయితే భారతీయులు అందరూ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు.