జాతీయ వార్తలు

మోసాలకు చెంపపెట్టు ‘జన్‌ధన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహా (అసోం), ఏప్రిల్ 8: అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సుడిగాలి ప్రచార సభలతో కాంగ్రెస్ పాలనపైనా, అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం రహాలో జరిగిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా శారదా చిట్‌ఫండ్ స్కాంను ప్రముఖంగా ప్రస్తావించారు. పేద ప్రజలు బ్యాంకులతో అనుసంధానం కాలేకపోవటం వల్లనే బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్ స్కాం లాంటివి చోటు చేసుకున్నాయని ఆయన పరోక్షంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీపై ఆరోపణలు చేశారు. చిట్‌ఫండ్‌ల మోసాల నుంచి పేద ప్రజలను కాపాడేందుకే తమ ప్రభుత్వం జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. శారదా స్కాం ద్వారా బెంగాల్, అసోం, ఒడిషాలలో పేదలు లూటీ అయ్యారన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌పైనా ఆయన విమర్శలు కురిపించారు. ‘‘నోటి మాటల కంటే పని మాత్రమే ఎక్కువ మాట్లాడాలని మన్మోహన్ అనేవారు. మన్మోహన్‌జీ ఇప్పుడు మీ పని మాట్లాడుతోంది. మీ పాపాలు మాట్లాడుతున్నాయి.. ప్రజలు ఎంత సతమతమవుతున్నారో ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని మోదీ అన్నారు. మన్మోహన్‌ను ప్రధాని సీట్లో కూచోబెట్టి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా వెనుకసీటు డ్రైవింగ్ వల్ల దేశం ఎన్ని బాధలు పడిందో చూస్తున్నామని మోదీ అన్నారు. ఈరకమైన రిపోట్ కంట్రోల్ పాలన వల్ల అస్సాం నాశనం కావటానికి వీల్లేదని ఆయన ప్రజలకు హితవు పలికారు. యూపీఏ-1 పాలనలో మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ, అన్ని ముఖ్యమైన నిర్ణయాలు సోనియాయే తీసుకున్నారని, దీనికి తోడు వామపక్షాలు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిచ్చే పేరుతో మరో అధికార కేంద్రంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మరో మూడు రోజులే మిగిలి ఉందని.. వదంతులను ప్రచారం చేసేవారికి సరైన సమాధానం చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు.