అంతర్జాతీయం

ఐరాస ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఇక పారదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 10: ఐక్యరాజ్య సమితి 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు బహిరంగ చర్చల్లో పాల్గొని సభ్య దేశాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎన్నిక వ్యవహారంలో పారదర్శకతను పెంపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ మార్పునకు శ్రీకారం చుట్టి ప్రస్తుతం ఈ పదవికి పోటీపడుతున్న ఎనిమిది మంది అభ్యర్థులను ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగే సాధారణ చర్చల్లో 193 సభ్య దేశాలతోపాటు రెండు పరిశీలక దేశాల (పాలస్తీనా, హోలీ సీ) ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను పౌర సమాజ సభ్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా సాధారణ ప్రజలు ప్రశ్నలు అడిగేందుకు వీలు కలుగుతుంది. విస్తృత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎన్నికతోపాటు మొత్తం అధికార యంత్రాంగం చుట్టూ పారదర్శకతను పెంపొందించడంలో ఇది ముఖ్యమైన మలుపు అవుతుందని యుఎన్ న్యూస్ సెంటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మోగెన్స్ లిక్కెటోఫ్ట్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని కొన్ని శక్తిమంతమైన దేశాలు తెరచాటుగా ఎంపిక చేయడం ఇప్పటివరకూ సాంప్రదాయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే చరిత్రలో తొలిసారి ప్రస్తుతం ఈ పదవికి రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ చర్చల్లో పాల్గొని సభ్య దేశాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుండటంతో ఈ సాంప్రదాయానికి తెర పడనుంది.
మరోవైపు గత 70 ఏళ్లలో ఐక్యరాజ్య సమితికి కనీసం ఒక్క మహిళ కూడా నాయకత్వం వహించకపోవడంతో ప్రధాన కార్యదర్శిగా ఈసారైనా మహిళను ఎన్నుకోవాలని వివిధ దేశాలు, పౌర సమాజ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.