జాతీయ వార్తలు

అసోంలో నేడు తుది విడత పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/కోల్‌కతా, ఏప్రిల్ 10: అసోంలో చివరి విడత, పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌ను సోమవారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిగ్గింగ్ తదితర అక్రమాలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అసోంలోని 61 నియోజకవర్గాలలో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ అధికార కాంగ్రెస్, బిజెపి-ఎజిపి-బిపిఎఫ్ కూటమి, ఎఐయుడిఎఫ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. దిగువ, మధ్య అసోంలో గల ఈ నియోజకవర్గాలలో మొత్తం 12,699 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,04,35,271 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 50వేలకు పైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో ముఖ్యంగా ఎన్‌డిఎఫ్‌బి(ఎస్) తీవ్రవాదుల ప్రాబల్యం గల నాలుగు బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాల్లో, ఇటీవల బాంబు పేలుడు చోటుచేసుకున్న గోల్‌పర జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని ధుబ్రి జిల్లాలో, భూటాన్ సరిహద్దులోని బక్స జిల్లాలో రెప్పవాల్చని నిఘాను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 57, ప్రతిపక్ష ఎఐయుడిఎఫ్ 47, బిజెపి 35, బిపిఎఫ్ 10, ఎజిపి 19, సిపిఎం 9, సిపిఐ 5 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, బర్ద్వాన్ జిల్లాల్లో గల 31 నియోజకవర్గాలలో 21 మంది మహిళలు సహా మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలలో మొత్తం 8,465 పోలింగ్ కేంద్రాలలో సుమారు 70 లక్షల మంది ఓటర్లు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో 33.6 లక్షల మంది మహిళలు ఉన్నారు.
బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ కూటమి, బిజెపి కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్ష నాయకుడు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సూర్యకాంత్ మిశ్రా నారాయణ్‌గఢ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మానస్ భునియా సాబాంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుడయిన 91ఏళ్ల గ్యాన్ సింగ్ సోహన్‌పాల్ మళ్లీ ఖరగ్‌పూర్ సాదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆయనతో తలపడుతున్నారు. బెంగాలీ సినీ నటుడు సోహమ్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, కార్గిల్ యుద్ధంలో భారత్ తరపున పోరాడిన కల్నల్ (రిటైర్డ్) దీప్తాంశు చౌదరి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో ఎన్నికలు జరిగే ఒక పోలింగ్ కేంద్రానికి
పదవుల్లో ఇవిఎంలను తరలిస్తున్న సిబ్బంది