అంతర్జాతీయం

మిస్సోరిలో ట్రంప్, హిల్లరీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 13: కీలకమైన న్యూయార్క్ ప్రైమరీకి ఈ నెల 19న ఎన్నికలు జరగనుండగా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ప్రధాన పక్షాల్లో అందరికన్నా ముందున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లకు ఓ తీపి వార్త అందింది. దాదాపు నెల రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మిస్సోరి ప్రైమరీ ఎన్నికల్లో ఈ ఇద్దరూ గెలుపొందినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. గత మార్చి 15న జరిగిన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల ప్రైమరీ ఎన్నికల ఫలితాలను మిస్సోరి రాష్ట్ర మంత్రి జాసన్ కాండర్ ట్విట్టర్‌లో ప్రకటిస్తూ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు అధికారికంగా విజయం సాధించినట్లు తాను సర్టిఫై చేశానన్నారు. కాగా, రెండు పార్టీల్లో ప్రధాన పోటీదారులకు వచ్చిన ఓట్లలో కూడా పెద్ద తేడా లేదు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్, ఆయన ప్రధాన ప్రత్యర్థి, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడగా, డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌లదీ అదే పరిస్థితి. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ట్రంప్‌కు క్రుజ్‌పై కేవలం 0.2 శాతం పాయింట్లు మాత్రమే ఆధిక్యత లభించింది. ట్రంప్‌కు 40.9 శాతం ఓట్లు రాగా, క్రుజ్‌కు 40.7 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్‌కు 35 మంది డెలిగేట్ల లభించనుండగా, క్రుజ్‌కు 15 మంది మాత్రమే లభించనున్నారు. డెమోక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్ 49.6 శాతం పాయింట్లు రాగా, శాండర్స్‌కు 49.4 శాతం పాయింట్లు వచ్చాయి.
నిబంధనలను మార్చేస్తున్నారు
వాషింగ్టన్: అధ్యక్ష పదవికి పార్టీ నామినేషన్‌ను దక్కించుకోకుండా అడ్డుకోవడానికే రిపబ్లికన్ పార్టీ అధినాయకత్వం తనకు వ్యతిరేకంగా ప్రైమరీ ఎన్నికల నిబంధనలను మార్చి వేసిందని డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆరోపించారు. నిబంధనల గురించి తనకు బాగా తెలుసునని, పార్టీ అధినాయకత్వం వాటిని తనకు వ్యతిరేకంగా కుప్పపోస్తోందని కూడా తనకు తెలుసునని 69 ఏళ్ల ట్రంప్ ఇక్కడ టౌన్‌హాల్‌లో చర్చాగోష్ఠి సందర్భంగా సిఎన్‌ఎన్‌తో అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ తన ప్రధాన ప్రత్యర్థి టెడ్ క్రుజ్ ఎక్కువ మంది డెలిగేట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.

తన మాదిరిగానే డెమోక్రాట్లు సైతం తమ ఫేవరేట్ అయిన హిల్లరీ క్లింటన్ పార్టీ నామినేషన్ పొందడానికి వీలుగా ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌కు వ్యతిరేకంగా నిబంధనలను కుప్పబోస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందాలంటే ఎవరికైనా మొత్తం 1237 మంది డెలిగేట్లు ఉండాలి. ప్రస్తుతం ట్రంప్‌కు 755 మంది డెలిగేట్లు ఉంటే క్రుజ్‌కు 545 మంది డెలిగేట్లు ఉన్నారు. ట్రంప్ ఇప్పుడు న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తాజా సమాచారం ప్రకారం అక్కడ ట్రంప్ మిగతావారికన్నా 40 పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారు. కాగా, త్వరలో ప్రైమరీ ఎన్నికలు జరగబోయే మరికొన్ని రాష్ట్రాల్లో సైతం తనకే మెజారిటీ లభించే అవకాశాలున్నాయని అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ మహాసభ జరిగే నాటికన్నా ముందే 1237 మంది డెలిగేట్ల మద్దతును సంపాదించగలనన్న నమ్మకం తనకు ఉందని ట్రంప్ చెప్పారు.

న్యూయార్క్‌లో తన మద్దతుదారుల నుద్దేశించి మాట్లాడుతున్న ట్రంప్