అంతర్జాతీయం

ఇరాన్‌తో వాణిజ్యబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, ఏప్రిల్ 17: భారత్, ఇరాన్‌ల మధ్య అనుబంధం కొత్త పుంతలు తొక్కబోతోందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంకోసం ఇరాన్ పర్యటనకు వచ్చిన సుష్మా ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ జరీఫ్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా చమురు, గ్యాస్ రంగాల్లో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పెట్టుబడుల గురించి ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. అమెరికాతో చరిత్రాత్మక అణు ఒప్పందం దరిమిలా ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య విస్తృత వాణిజ్య బంధం దృఢపడేందుకు అనువైన అవకాశాలను వీరు సమీక్షించారు. సౌదీ అరేబియా తరువాత దాదాపు 400 బిలియన్ అమెరికన్ డాలర్ల అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇరాన్ పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రదేశమని జరీఫ్ అన్నారు. ఇరాన్‌తో ఇంధన వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇరాన్ నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న 350వేల బారెల్స్ చమురు దిగుమతులను మరింత పెంచాలని ఇరాన్‌ను కోరింది. ఇప్పటి వరకూ కొనసాగిన చమురు ఉచిత రవాణా విధానాన్ని కూడా ఇరాన్ రద్దు చేసిన అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం భారత రిఫైనరీలకు సరఫరా చేస్తున్న చమురుకు భారత రూపాయలలో కాకుండా యూరో కరెన్సీలో చెల్లింపులు జరపాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
భారతీయుల సమస్యలు తీరుస్తా
ఇరాన్ పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఆదివారం టెహ్రాన్‌లో 1941లో నిర్మించిన చరిత్రాత్మక గురుద్వారాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయులతో భేటీ అయ్యారు. ఇరాన్‌లో వారి పట్ల ఇరాన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించటానికి తప్పక పరిష్కరిస్తామని సుష్మా వారికి హామీ ఇచ్చారు.

టెహరాన్‌లో ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌తో సమావేశమైన సుష్మా స్వరాజ్