అంతర్జాతీయం

ఇయునుంచి వైదొలగితే బ్రిటన్ ఉనికికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 24: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగితే ప్రపంచంపై దాని ప్రభావం తగ్గుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. బ్రిటన్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి పదేళ్లు పట్టవచ్చని కూడా ఆయన హెచ్చరించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనకు వచ్చిన ఒబామా చివరి రోజయిన ఆదివారం బిబిసికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని బ్రిటన్ వదలుకోవాలా? వద్దా? అనే అంశంపై జూన్‌లో నిర్వహించే రెఫరెండంలో ఇయు నుంచి బయటకు రావాలనే బ్రిటన్ నిర్ణయిస్తే ప్రపంచ వ్యవహారాలపై దాని ప్రభావం తగ్గుతుందని ఒబామా అన్నారు. ఇయు నుంచి బ్రిటన్ వైదొలగితే ఆ దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని (పోస్ట్-బ్రెక్సిట్ ట్రేడ్ డీల్) కుదుర్చుకోవడానికి ఇప్పటి నుంచి ఐదేళ్లయినా పట్టొచ్చు, పదేళ్లయినా పట్టొచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఏ విషయంపైనయినా యూరోపియన్ యూనియన్ కన్నా వేగంగా బ్రిటన్ అమెరికాతో సంప్రదింపులు జరుపజాలదని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామి అయిన యూరోపియన్ మార్కెట్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి తమ సంప్రదింపులను వదలిపెట్టబోమని ఒబామా తేల్చిచెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగితే బ్రిటన్ ఎదుర్కోబోయే పరిణామాల గురించి ఒబామా ఇటీవలి కాలంలో పలుసార్లు హెచ్చరించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలని వాదిస్తున్న ఆ దేశంలోని నేతలు ఒబామా వైఖరిపై మండిపడుతున్నారు. ఆదివారం నాటి ఒబామా హెచ్చరికలు వారిని మరింత ఆగ్రహానికి గురిచేశాయి. బ్రిటన్ అంతర్గత వ్యవహారాల్లో ఒబామా అనుచిత జోక్యం చేసుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. ఒబామా బ్రిటిష్ వ్యతిరేకి అయి ఉండొచ్చని కూడా వారు వ్యాఖ్యానించారు. లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ తదితరులు తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎదురయ్యే ప్రమాదాల గురించి వైట్ హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం)కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.