జాతీయ వార్తలు

బరితెగించిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సిఎం చంద్రబాబు నాయకత్వంలో రాజకీయ అవినీతి సాగుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కోట్లు ప్రలోభపెట్టి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమకు మద్దతివ్వాలని మంగళవారం జాతీయ నేతలను కలిసి కోరారు. జగన్ వెంట మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర ఎంపీలు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ తదితర నేతలు ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం లక్షా 34వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ‘చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని రాజ్‌నాథ్, పవార్, ఏచూరి తదితరులకు అందించారు. అవినీతి కోట్లతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగని వైకాపా ఎమ్మెల్యేలను భయపెడుతున్నారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట దాదాపు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రమంత్రులు తక్కువ ధరకు భూములు కొని, రైతుల నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. అధికార తెలుగుదేశం అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయస్థాయిలో ఎండగట్టేందుకు ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నాయకత్వంలో వైకాపా ప్రతినిధుల బృందం జాతీయ నేతలను కలుస్తోంది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేను 20 నుంచి 30 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆయనకు అంత సొమ్ము ఎక్కడినుంచి వచ్చిందో ఏవరైనా అడుగుతున్నారా? అని జగన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేసినా తప్పేనన్నారు. తెదేపా ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు ఓట్లు కొనుగోలు చేస్తూ టేపుల్లో దొరికిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహించారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే దిక్కులేదు. అలాంటి వారిని మంత్రులుగా నియమించే దిక్కుమాలిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. దేవుడు తమతో ఉన్నంతవరకూ ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ఫరవాలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ, రైతులను దెబ్బ తీస్తున్నారని దుయ్యబట్టారు. బాబుపట్ల రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. రాజధాని ఎక్కడ నిర్మించాలో ముందే నిర్ణయించుకుని, తెదేపా ప్రభుత్వం ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసిందని ఆరోపించారు.

చిత్రం... ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, వైఎస్ జగన్