జాతీయ వార్తలు

రెండోరోజూ గొడవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, జెఎన్‌యు విద్యార్థులను తొలగించిన అంశంపై మంగళవారం రాజ్యసభ దద్దరిల్లింది. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖనీ చేస్తోందని, వర్శిటీల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద బైఠాయించటంతో రాజ్యసభ గందరగోళంలో పడింది. ఇతర కార్యక్రమాలు చేపట్టకుండానే బుధవారాని కి వాయిదా పడింది. కాంగ్రెస్ ఆం దోళనతో నాలుగుసార్లు వాయిదా అనంతరం కూడా సభ అదుపులోకి రాకపోవడంతో ఉదయం 11 గంటలకే డిప్యూటీ చైర్మన్ పిజె కురియను సభను వాయిదావేసి వెళ్లిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, వి హనుమంతరావు, జెడి శీలం, కెవిపి రామచందర్‌రావు, రేణుకాచౌదరి సహా 20మంది ఎంపీలు పోడియం వద్ద పెద్దపెట్టున నినాదాలివ్వడంతో సభ దద్దరిల్లింది. రెండు అంశాలపై చర్చిద్దామని చైర్మన్ హమీ ద్ అన్సారీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కాంగ్రెస్ దిగిరాలేదు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటాన్ని ఖండించే తీర్మానాన్ని సభలో ఆమోదించాలని కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, జెఎన్‌యు నుంచి విద్యార్థులను తొలగించడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంటు చట్టం ద్వారా వర్శిటీలు ఏర్పాటైనందను వాటిలో జరిగే పరిణామాలపై చర్చించే అధికారం రాజ్యసభకు ఉందని సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ పార్లమెంటరీ పక్షం ఉప నాయకుడు డి రాజాలు పట్టుబట్టారు. జెఎన్‌యు వి ద్యార్థులపై కఠిన చర్యలు అన్యాయమని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ గట్టిగా ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు డిమాండ్ చేశాయి. కోర్టు పరిశీలనలో ఉన్నా ఈ అంశంపై చర్చ జరిపే వీలుందని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ చేసిన వాదనతో ఎస్పీ సీనియర్ సభ్యుడు నరేష్ అగర్‌వాల్, బిఎస్పీ అధినేత్రి మాయావతి సమర్థించారు. విపక్షాల వాదనను రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. ఉత్తరాఖండ్ శాసన సభ స్పీకర్ మైనారిటీని మెజారిటీ చేయటం గురించి మాట్లాడాల్సి ఉందన్నారు. ఆర్థిక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశామంటూ 57 మందిలో 35మంది ఎమ్మెల్యేలు చెబుతుంటే, స్పీకర్ మాత్రం ఆర్థిక బిల్లును సభ ఆమోదించిందని ఎలా ప్రకటిస్తారని జైట్లీ ప్రశ్నించారు. దీంతో కాంగ్రె స్ సభ్యులు పోడియం వద్దకు మళ్లీమళ్లీ వచ్చి గొడవ చేయటంతో కురియన్ సభను బుధవారం ఉదయం వరకూ వాయిదా వేయకతప్పలేదు.

ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, జెఎన్‌యు విద్యార్థులను తొలగించిన అంశంపై మంగళవారం దద్దరిల్లిన రాజ్యసభ