జాతీయ వార్తలు

విదేశీ ఆస్తులు వెల్లడించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనని కోర్టు గట్టిగా చెప్పింది. కుటుంబ సభ్యుల ఆస్తులూ వెల్లడించాలని ఆదేశించింది. కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని విదేశాలకు వెళ్లిపోయిన విజయ్ మాల్యా తనపై దాఖలైన విచారణకు సహకరించడంలేదని బ్యాంకుల కన్సార్టియం ఆరోపించింది. ఈమేరకు సోమవారం సుప్రీం కోర్టులో వారు అఫిడవిట్ దాఖలు చేశారు. విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మాజీ లిక్కర్ కింగ్ మాల్యా 17 బ్యాంకులకు తొమ్మిదివేల కోట్ల రూపాయల వరకూ ఎగవేశారు. బ్యాంకుల కన్సార్టియం పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీం కోర్టు తమతో ఆడుకోవద్దని మాల్యాపై తీవ్రంగా పడింది. అలాగే మూడు నెలల్లో దీనికో పరిష్కారం చూడాలని రుణ రికవరీ ట్రిబ్యునల్(డిఆర్‌టి)ని కోర్టు ఆదేశించింది. మరోపక్క విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఎథక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రుణాలు తీసుకుని ఎగ్గొటిన మాల్యా నుంచి ముక్కుపిండి ఒకేసారి సొమ్ములు రికవరీకి న్యాయ నిపుణుల సలహా కోరనున్నట్టు తెలిసింది. ఆస్తుల అమ్మి వాటి నుంచి రాబట్టాలంటే ఏళ్లు పడతాయి కాబట్టి డిఆర్‌టి అయితే మూడు నెలల్లో పరిష్కరించడానికి సాధ్యమవుతుందని అంటున్నారు. బాకీ కింద 6,868 కోట్ల రూపాయలు చెల్లించడానికి మాల్యా మందుకొచ్చినా బ్యాంకులు నిరాకరించాయి. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో మాజీ లిక్కర్ కింగ్ మరిన్ని చిక్కుల్లో పడినట్టయింది.