జాతీయ వార్తలు

మాటవరసకే అలా అన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చట్టమే గనుక అడ్డుపడకపోయి ఉంటే ‘్భరత్ మాతాకీ జై’ అని అనడానికి ఇష్టపడని వాళ్ల తలలు నరికి ఉండేవాడినని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రాందేవ్ మాట మార్చారు. తాను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రాందేవ్, మెడపై కత్తి పెట్టినా సరే తాను మాత్రం భారత్ మాతాకీ జై అని అననంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనపై మాత్రమే తాను అలా స్పందించానని రాందేవ్ అన్నారు. అంతేకాదు, ఇస్లామ్, క్రైస్తవ మతం లాంటి మతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ఒవైసీ వ్యాఖ్యల మాదిరిగా తప్పేనని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాందేవ్ చెప్పారు. ‘నా తల నరికినా సరే నేనుమాత్రం భారత్ మాతాకి జై అని అననని ఒవైసీ చెప్పారు. అందుకే తాను కూడా అలాంటి మొరటుభాషలోనే మాట్లాడాను’ అని రాందేవ్ అన్నారు. తనకు రాజ్యాంగంపై నమ్మకం ఉందని, తనను చూసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అహింస, శాంతియుత సహజీవనం, అందరూ సమానమేనన్న వాటిని తాను నమ్ముతానని ఆయన అంటూ, తనను చూసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదన్నారు. ఎవరైనా భారత్- మాతాకీ జై అని అనాలనుకుంటే అతడ్ని అలా అననివ్వండి, అందులో తప్పేముందని కూడా రాందేవ్ అన్నారు.

ఛాతినొప్పితో
ఎయిమ్స్‌లో చేరిన సుష్మా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర అస్వస్థతతో సోమావరం రాత్రి ఎయిమ్స్‌లో చేరారు. జ్వరం, ఛాతినొప్పితో ఆమె ఆసుపత్రిలో చేరారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉందని వైద్యులు మంగళవారం వెల్లడించారు. జ్వరం, చాతి నొప్పితో బాధపడుతున్న సుష్మాకు న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్ ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నట్టు వారు తెలిపారు. 64 ఏళ్ల సుష్మాస్వరాజ్ ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకు హాజరవుతున్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరితో భేటీ కావల్సి ఉంది. ఆఫ్గనిస్తాన్ శాంతి, సుస్థిరత నెలకొల్పాలన్న ఉద్దేశంతో జరుగుతున్న సదస్సుకు భారత్ ఆతిధ్యమిస్తోంది.