జాతీయ వార్తలు

నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న జపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఎన్ని కమిటీలు వేసినా, దర్యాప్తులు జరిపించినా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నెలకొన్న మిస్టరీ తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించి తన వద్ద ఉన్న పత్రాల్లో కొన్నింటిని జపాన్ విడుదల చేయనుంది. నేతాజీకి చెందిన వందలాది రహస్య పత్రాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది నెలల తర్వాత జపాన్ కూడా తన వద్దనున్న కొన్ని పత్రాలను విడుదల చేయనుండడం గమనార్హం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు మంగళవారం పార్లమెంటులో ఈ విషయం ప్రకటించారు. నేతాజీకి సంబంధించిన అయిదు రహస్య పత్రాలు జపాన్ వద్ద ఉన్నాయని, వాటిలో రెండింటిని అది ఈ ఏడాది చివరి నాటికల్లా విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి 23న నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వంద రహస్య పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫైళ్లలో బ్రిటీష్ పాలన మొదలుకొని 2007 దాకా ఉన్న 16 వేలకు పైగా చారిత్రక డాక్యుమెంట్లున్నాయి. నేతాజీ అదృశ్యం మిస్టరీపై ప్రభుత్వం ఇప్పటివరకు మూడు కమిటీలను నియమించింది. వీటిలో రెండు కమిటీలు 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు నిర్ధారించాయి. అయితే జస్టిస్ ముఖర్జీ కమిటీ మాత్రం ఈ వాదనలను ఖండిస్తూ, ఆయన ఇంకా జీవించే ఉన్నాడనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో దాదాపు 70 సంవత్సరాలుగా నేతాజీ అదృశ్యం ఒక మిస్టరీగానే మిగిలి పోయింది.