అంతర్జాతీయం

ఆధిక్యంలో హిల్లరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా అధ్యక్ష పదవికి పార్టీల అభ్యర్థిత్వ రేసు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ సర్వే రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ కంటే, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మూడుశాతం ఆధిక్యంతో ముందుకు సాగుతున్నట్లు తేల్చింది. జార్జివాషింగ్టన్ యూనివర్సిటీ బాటిల్‌గ్రౌండ్ నిర్వహించిన పోల్ సర్వేలో హిల్లరీ 46శాతం, ట్రంప్ 43శాతం మంది మద్దతుతో కొనసాగుతున్నారు. ఇంకా 11శాతం మంది ఎటూ తేల్చుకోలేదు.
యూనివర్సిటీకి చెందిన బైపార్టిసన్ పోల్, టర్రాస్ గ్రూప్, లేక్ రీసర్చ్ పార్టనర్‌లతో కలిసి ఈ పోల్ నిర్వహించింది. దాదాపు 89శాతం మంది రెండు పార్టీల నామినేషన్ ప్రక్రియను జాగ్రత్తగా అనుసరిస్తున్నారు. రెండు పార్టీల్లోని ప్రధాన అభ్యర్థులందరిపైనా వీరికి వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. హిల్లరీ, ట్రంప్‌లతో పాటు, వెర్మంట్ సెనెటర్ శాండర్స్, ఒహియె గవర్నర్ జాన్ కసిచ్‌ల ప్రతికూల రేటింగ్‌లు 50 శాతం కంటే తక్కువగానే (44, 29) ఉన్నాయి. కాగా ప్రతికూల రేటింగ్‌లో హిల్లరీ 56శాతం, ట్రంప్ 65శాతం, టెడ్ క్రజ్ 55శాతం ఉన్నారు. వీరి కంటే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా చాలా ‘బెటర్’ అని ఎక్కువ మంది అభిప్రాయ పడ్డారు. మొత్తం వెయ్యిమంది సంభావిత ఓటర్లపై ఏప్రిల్ 17 నుంచి 20 వరకు పోల్‌ను నిర్వహించారు. ఈ సర్వేలో 3.1శాతం పొరపాటు జరగవచ్చని పోల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఫొటో కలకలం..

2005లో జరిగిన డొనాల్డ్ ట్రంప్ వివాహానికి హాజరైన హిల్లరీ క్లింటన్, బిల్‌క్లింటన్