జాతీయ వార్తలు

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, ఏప్రిల్ 30: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులు సహా తొమ్మిది మంది మృతిచెందారు. చెళ్లకెర తాలూకాలో జాతీయ రహదారిపై క్రూయిజర్ వాహనాన్ని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్ డ్రైవర్ సహా బళ్లారికి చెందిన ఎనిమంది విద్యార్థినులు మృతి చెందారు. బిసిఎం హాస్టల్లో ఉంటున్న 8మంది విద్యార్థినులు ఒక ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ముగించుకుని శుక్రవారం రాత్రి బళ్లారికి తిరిగి వస్తుండగా సానికెర సమీపంలోని హగ్గేరి గేట్ వద్ద వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ వాహనాన్ని దేవదుర్గ నుంచి బళ్లారికి వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢీకొంది. దీంతో క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థినులు అక్కడికక్కడికే మృతి చెందారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్టు కర్నాటక కార్మిక శాఖ మంత్రి పరమేశ్వరనాయక్ తెలిపారు.

‘ఉజ్వల్ యోజన’కు నేడు శ్రీకారం

వారణాసి, ఏప్రిల్ 30: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన (పిఎంయువై) పథకం ఆదివారం ఆవిష్కృతం కానుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఐదువేల పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్లు అందజేయాలన్నది పిఎంయువై ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలోని బల్లియాలో ఆదివారం దీన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరి బల్లియా చేరుకుంటారు. అక్కడ ఉజ్వల్ యోజన ప్రారంభించిన తరువాత వారణాసి వెళ్తారు. వారణాసిలో సోలార్ పవర్ బోట్లు అందజేస్తారు. అలాగే వెయ్యి మందికి ఈ-రిక్షాలు మోదీ పంపిణీ చేస్తారు. డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే సమ్నేఘాట్ ప్రాంతంలో ఉన్న జనప్రవాహ్ సెంట్రర్ ఫర్ కల్చరల్ స్టడీస్, రీసెర్చి సెంటర్‌ను ప్రధాని సందర్శిస్తారు. ప్రముఖ సంఘసేవకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బిమ్లా పొద్దర్ 1997లో ఈ కేంద్రాన్ని స్థాపించారు. మధ్యయుగం నుంటి కళాఖండాలు, సారస్వత సంపద, అపురూపమైన శిల్పకళ, అరుదైన పుస్తకాలు జనప్రవాహ్ మ్యూజియంలో కొలువుతీరాయి. అక్కడ నుంచి గంగానదీ తీర అస్సీఘాట్‌కు వెళ్లి సోలార్ పవర్ ఈ-బోట్లు ప్రారంభిస్తారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించడం ఇది మూడోసారి.