అంతర్జాతీయం

అసమ్మతే ప్రజాస్వామ్యానికి పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, మే 1: అసమ్మతి లేకపోతే పార్లమెంటు వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉండదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఇక్కడ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ సహా అనేక కీలక అంశాలపై విస్తృతంగా పోటాపోటీగా చర్చ జరిగినప్పుడే అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని భారత్, న్యూజిలాండ్ వ్యాపార మండలి సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాల అమలును నేరుగా పరిశీలించేందుకు భారత్ రావాలంటూ న్యూజిలాండ్ వ్యాపారవేత్తలను రాష్టప్రతి ఆహ్వానించారు. తనతోపాటు వచ్చిన ప్రతినిధుల్లో ఓ కేంద్ర మంత్రి, ఓ పార్లమెంటు సభ్యుడు ఉన్నారని వెల్లడించిన రాష్టప్రతి, ‘ఇది భారత పార్లమెంటు ప్రత్యేకతకు నిదర్శనం. ప్రభుత్వానికి, ఎంపీలకు మధ్య సరైన సయోధ్య కొనసాగుతోందని చెప్పడానికి ఈ ఇద్దరూ నా బృందంలో ఉండడమే తార్కాణం’ అని పేర్కొన్నారు. వీరిద్దరూ కూడా భిన్న రాజకీయ పార్టీలకే కాకుండా దేశంలో భిన్న ప్రాంతాలకు చెందినవారని వెల్లడించిన ఆయన, భారతదేశంలో పనిచేస్తున్న బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఇది అద్దం పడుతోందని తెలిపారు. భారత పార్లమెంటు ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై విస్తృత స్థాయిలో వాదోపవాదాలు, చర్చలు జరుగుతాయని, అంతిమంగా ఉమ్మడి అభిప్రాయ ప్రాతిపదికగానే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. అయితే కొన్ని సందర్భాల్లో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న విషయాన్ని తాను స్పష్టం చేసినప్పటికీ, అది ఉమ్మడి స్ఫూర్తిని దెబ్బతీయడమేమీ కాదని వివరించారు. సంవాదాలు కొనసాగడమన్నది ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ గుణాత్మకంగా విశే్లషిస్తున్నారని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ శక్తివంతంగా పనిచేయడానికి ఈ ప్రక్రియ అత్యంత కీలకమని, అసమ్మతి లేనిదే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. భారతదేశంలో ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగడానికి దోహదం చేస్తున్న అనేక అంశాలను ప్రస్తావించిన రాష్టప్రతి ప్రణబ్, స్థూల జాతీయోత్పత్తి, ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ, విదేశీ వాణిజ్యంలో సమతూకం మొదలైన అన్నింటిలోనూ స్థిరమైన ఫలితాలనే 90వ దశకం నుంచీ భారత్ సాధిస్తూ వస్తోందని తెలిపారు. ప్రస్తుతం 7.2 వృద్ధిరేటుతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని, దీనిని 8 నుంచి 10 శాతం వరకూ సాధించే దిశగా బలమైన అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ రకమైన ఆర్థిక ఆశాభావ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న కొన్ని అర్థవంతమైన చర్యలే కారణమని తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ఆర్థిక వృద్ధి పతనం కాకుండా వస్తున్నందుకు న్యూజిలాండ్ పాలకులను ఆయన అభినందించారు.

అక్లాండ్‌లో ఆదివారం భారత్, న్యూజిలాండ్ వ్యాపార మండలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్టప్రతి ప్రణబ్