అంతర్జాతీయం

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇటలీకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేగ్, మే 3: మెరైన్ల కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇటలీకి చుక్కెదురైంది. నేరం జరిగింది భారత పరిధిలోనేనని సుప్రీంకోర్టు గనుక నిర్ధారిస్తే హత్యా నేరం ఎదుర్కొంటున్న మెరైన్ సాల్వటోర్ గిరోన్ ఆ దేశానికి అప్పగించాల్సిందేనని ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గిరోన్ బెయిల్ షరతుల్లో సడలింపుపొందడానికి, అలాగే ప్రస్తుత మధ్యవర్తిత్వ విచారణలో సుప్రీంకోర్టు అధికార విచారణ పరిధిలో ఉన్న గిరోన్ ఇటలీకి తిరిగి రావడానికి వీలుగా భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఇటలీ, భారత్‌లు సహకరించుకోవాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
మరో ఇటలీ మెరైన్ మస్సీమిలియానో లాటోర్‌తో పాటుగా గిరోన్ 2012లో కేరళ తీరం సమీపంలో ఇద్దరు నారతీయ జాలర్లను హత్య చేసారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2014లో గుండెపోటు రావడంతో లాటోర్ ఇటలీకి తిరిగి వెళ్లగా, గిరోన్ హేగ్‌లోని ఇటలీ దౌత్యకార్యాలయంలో ఉంటున్నాడు. ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కాగా, యుఎన్ కోర్టు గిరోన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పిందని ఇటలీ విదేశాంగ శాఖ వాదిస్తోంది. గిరోన్ ఇటలీకి తిరిగి వెళ్లడానికి కోర్టు అనుమతించిందని విదేశాంగ శాఖ చెప్పుకొంది. అయితే గిరోన్ బెయిల్‌కు సంబంధించి కచ్చితమైన నిబంధనలను నిర్ణయించే అధికారాన్ని యుఎన్ మధ్యవర్తిత్వ కోర్టు సుప్రీంకోర్టుకు వదిలివేసిందని భారత్ స్పష్టం చేసింది. అంతేకాదు గిరోన్ ప్రస్తుత మధ్యవర్తిత్వ పరిష్కార సమయంలో ఇటలీకి తిరిగి వెళ్లినప్పటికీ అతను సుప్రీంకోర్టు అధికారం కిందే ఉంటాడని కూడా కేంద్రం గుర్తు చేసింది.