శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పర్యాటక రంగం అభివృథ్ధి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 25: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను నిర్ధేశిత సమయంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో పర్యాటక అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మైపాడు బీచ్‌కు సంబంధించి నిర్దేశించిన పనులను కేటగిరివారీగా త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తడ నుంచి భీమునివారిపాళెం వరకు రోడ్డు మరమ్మతు పనులు, కావలి క్రాస్‌రోడ్డు నుంచి తుమ్మలపెంట వరకు గల రోడ్డు, టిపి గూడూరు నుంచి కొత్తకోడూరు బీచ్ వరకు రోడ్డు, నరవాడ క్రాస్‌రోడ్డు నుంచి ఉదయగిరి వరకుగల రోడ్డు మరమ్మతు పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అటకానితిప్ప, రామతీర్థం ప్రాంతాల మధ్య పర్యాటక అభివృద్ధి పనులు, మైపాడు బీచ్‌వద్ద చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పంచాయతీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇరకం వద్ద రిసార్ట్ ఏర్పాటుకు, తుమ్మలపెంట వద్ద బీచ్ రిసార్ట్, కండలేరు సమీపంలో తోకపాళెం రిసార్ట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్లిపాడు వద్ద పినాకిని గాంధీ ఆశ్రమ అభివృద్ధి, జువ్వలదినె్న వద్ద పొట్టిశ్రీరాములు మెమోరియల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పర్యాటకపరంగా అభివృద్ధి పనులు నాణ్యతలో పటిష్టంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. జనవరిలో ప్రతిష్టాత్మకంగా జరిగే పక్షుల పండుగ గతానుభవాలను, నిర్వహించిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మరింత వైభవంగా జరిగేలా సంబంధిత అధికారులతో కమిటీ వేసి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రవౌళి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ బుగ్గయ్య, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటరత్నం, కుమార్‌రాజ, నగర కార్పొరేషన్ ఎస్‌ఇ జె శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.