శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో ఉప్పు కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 13: నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఉప్పు కొరత లేదని, ప్రజలు ఈ విషయంలో వచ్చే పుకార్లను నమ్మవద్దని జిల్లా సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. తన చాంబర్‌లో ఆయన ఆదివారం ఉప్పు హోల్‌సేల్ డీలర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, పుడ్ ఇన్స్‌పెక్టర్లు, పోలీస్ అధికారులతో ఉప్పు వినియోగం, నిల్వలపై సమావేశం నిర్వహించారు. అవసరమైన మేర ఉప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కొందరు పనిగట్టుకుని పుకార్లు సృష్టిస్తున్నారని, ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరత సృషించి అధిక ధరలకు అమ్మాలని చూస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇంటర్ బోర్డు రద్దు చేయాలి
* జడ్పీ చైర్మన్ రాఘవ డిమాండ్
* మంచి సలహా అని కేంద్ర మంత్రి వెంకయ్య కితాబు
ఆత్మకూరు, అనుమసముద్రంపేట, నవంబర్ 13: రాష్ట్రంలో ఇంటర్ బోర్డును రద్దుచేయాలని నెల్లూరుజిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు నియోజవకర్గ పరిధిలోని చిరమన గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటకల్లో ఇంటర్ విద్యాభ్యాసానికి ప్రత్యేకంగా బోర్డులు అంటూ లేవన్నారు. ఇంటర్ విద్యాభ్యాసానికి బదులు 11,12 తరగతులుగా హైస్కూల్‌లోనే చదవడం జరుగుతుందన్నారు. నెల్లూరుజిల్లాలో ప్రభుత్వ విద్యకు సంబంధించి పదో తరగతి వరకు 20వేల మంది చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదే ఇంటర్‌కు వస్తే కేవలం నాలుగు వేల మంది వరకు మాత్రమే అలా ప్రభుత్వ విద్యాభ్యాసం పొందే అవకాశాలున్నాయన్నారు. రాష్టవ్య్రాప్తంగా చూసినట్లైతే రెండున్నర లక్షల మందికి పదవ తరగతిలో ప్రభుత్వ విద్య అందుబాటులో ఉంటుందన్నారు. అదే ఇంటర్‌కు మాత్రం తొంభైవేల వరకు మాత్రమేనన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థుల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా డ్రాపౌట్స్‌గా మారుతున్నారన్నారు. అందువల్ల ఇంటర్‌బోర్డును రద్దు చేసి హైస్కూళ్లలోనే 10+1, 10+2 విలీనం చేయడం సముచితమన్నారు. అలాకాకుంటే ఇంటర్ మీడియట్‌కు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ కల్పించాలన్నారు. ఆ తరువాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో జడ్పీ చైర్మన్ చేసిన సూచన సముచితమైనదేనంటూ కొనియాడారు. దీనిపై విస్తృతంగా పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి
* నెల్లూరు ఎంపి మేకపాటి
ఆత్మకూరు, నవంబర్ 13: ప్రత్యేక హోదా కేటాయించడంతోనే నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభ్యున్నతికి నోచుకోగలదని, తద్వారానే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడగలవని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చిరమన గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మేకపాటి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ప్రత్యేక హోదా ప్రస్తావన ముగిసిన అధ్యాయం అంటూ కేంద్ర మంతి వెంకయ్య పేర్కొనడం తగదంటూ సున్నితంగానే ఎంపి మేకపాటి తన ప్రసంగంలో తప్పుబట్టారు. అలాగాకుండా ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీకి నచ్చచెప్పడం ద్వారా అంగీకరింపచేయాలంటూ తన విన్నపాన్ని వివరించారు. ఇదిలాఉంటే నవంబర్ రెండో వారం ముగుస్తున్నా ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఇంతవరకు లేకపోవడంతో నెల్లూరుజిల్లాను తీవ్ర దుర్భిక్ష ఛాయలు ఆవహించాయన్నారు. అందువల్ల గోదావరి జలాలు కృష్ణానది మీదుగా పెన్నాకు తీసుకువ్చ ప్రక్రియ ముమ్మరం చేయడం ద్వారా నెల్లూరుజిల్లాను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదిలాఉంటే వెంకయ్య సుమారు గంట సేపుచేసిన తన ప్రసంగంలో ఆంధ్రాకు నిధుల వరద గురించి, వివిధ జాతీయ సంస్థల ఏర్పాటు గురించి చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా లేదన్నారు. అంతే తప్పా పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ సమస్య సమూల నివారణకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

అమెరికాలో ఎఎస్‌పేట వాసి మృతి
అనుమసముద్రంపేట, నవంబర్ 13: మండలంలోని పెద్దబ్బీపురానికి చెందిన పార్ధసారథి (40) అనే వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. ఆదివారం అతని సోదరుడు ఈ మేరకు వివరాలను స్థానిక విలేఖర్లకు తెలిపాడు. అమెరికాలో బల్లాస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా అతను పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, ఆ ఘటనలో పార్ధసారథి మృతి చెందగా, భార్య లీలావతి స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారికి ఓ కుమార్తె సంతానం ఉన్నారు.