శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో పర్యటించనున్న లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 17: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జిల్లాలో జరుగుతున్న పార్టీ జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు గురువారం రాత్రి నెల్లూరుకు విచ్చేశారు. రాత్రి పొద్దుపోయాక నెల్లూరుకు వచ్చిన ఆయన స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హోటల్ వద్ద నుంచి మోటార్‌సైకిల్ ర్యాలీ ద్వారా పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అక్కడ్నుంచి నారాయణ మెడికల్ కళాశాలకు వెళ్లి యువచైతన్య సదస్సులో విద్యార్థులతో ముచ్చటిస్తారు. అక్కడే పార్టీ సభ్యత్వం ద్వారా ప్రమాద బీమా పొందిన కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం గూడూరుకు బయల్దేరి 4 గంటలకు అక్కడ నిర్వహించే బైక్ ర్యాలీ, జనచైతన్య యాత్రలో పాల్గొని, రాత్రి 7 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి రేణిగుంటకు బయల్దేరి వెళతారు.

చినబాబు గారు..
కార్యకర్తలకు భరోసానివ్వాలి

నెల్లూరు, నవంబర్ 17:
గౌరవనీయులైన లోకేష్‌బాబు గారికి,
చాలా రోజుల తర్వాత, అందులోనూ పార్టీ కార్యక్రమ నిమిత్తం జిల్లాకు వస్తున్న మీకు టిడిపి కార్యకర్తలందరి తరపున ఆత్మీయ స్వాగతం తెలుపుతున్నాం. కార్యకర్తల గురించి ఏమాత్రం ఆలోచించని ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యకర్తలతో పాటు వారి కుటుంబాల గురించి కూడా మీరు ఆలోచించి దేశంలోనే తొలిసారి ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించినందుకు కృతజతలు చెప్పుకోవాలి. కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న మీకు జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యం, ఆవేదనను మీ దృష్టికి తీసుకురావాలనేదే మా చిన్ని ప్రయత్నంతో కూడిన విన్నపం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీ పెట్టే ఎన్నో ఇబ్బందులకు ఓవైపు బాధపడుతున్నా, మన పార్టీకి మంచి రోజులు వచ్చేదాకా ఆ బాధలన్నింటిని దిగమింగుకుని జిల్లాలో ప్రజా వ్యతిరేక అప్పటి ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. కొన్ని సందర్భాల్లో లాఠీ దెబ్బలు సైతం తిన్నాం. పదేళ్ల తర్వాత మా కష్టం ఫలించి, మా అధినేత మీద మాతో పాటు రాష్ట్ర ప్రజానీకం నమ్మకం ఉంచి అధికారంలోకి తీసుకురావడంతో విడిపోయిన రాష్ట్రంతో పాటు మాకు కూడా న్యాయం జరుగుతుందని ఎంతో భావిస్తూ వచ్చాం. విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మన అధినేత చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే, మీరు మీ పరిధిలో ఆయనకు ఎంతో సహకారం అందిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇదే సమయంలో జిల్లాలో పార్టీ ఏర్పడిననాటి నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న నిజమైన కార్యకర్తలకు ఎంతో అన్యాయం జరుగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వస్తుంటే అధినేత సూచనతో వారిని కూడా మాలో కలుపుకోడానికి సిద్ధమయ్యాం. అయితే కొత్తగా పార్టీలోకి స్వార్థంతో చేరే వారికి దక్కే గౌరవ మర్యాదలు పార్టీలోనే ఉంటూ వచ్చిన మాలాంటి కార్యకర్తలకు దక్కడం లేదు. ఈ విషయం జిల్లాలో ఏ కార్యకర్తనడిగినా మీకు చెబుతారు. అలా అని మీరు పట్టించుకోవడం లేదని కాదు మా అభిప్రాయం. జిల్లాలో మాకు జరుగుతున్న అన్యాయం మీ దృష్టికి మా జిల్లా నేతలు తీసుకురావడంలో విఫలమయ్యారు. కొత్త వారికి అన్ని పదవులు దక్కుతున్నాయి. పాత వారికి జెండాలు మోయడమే పనిగా మిగిలింది. పార్టీ జెండా మోసేందుకు మాకేమాత్రం నామోషీ లేదు. పదవి దక్కినా దక్కకపోయినా మేము పార్టీని వీడేది లేదు. కానీ మన జెండాను అవహేళన చేసిన వారిని అందలం ఎక్కిస్తూ మమ్మల్ని వెక్కిరిస్తుండడం బాధ కలిగిస్తోంది. పార్టీని భుజస్కంధాలపై మోస్తూ పార్టీ ఎంపిక చేసిన వ్యక్తుల పల్లకిని మోసే బోరుూల వంటి మా ఆవేదనను మీరు తప్పక మన్నిస్తారని ఆశిస్తూ...

రోడ్డెక్కిన విద్యార్థులు
* ఎబివిపి చేపట్టిన నిరాహార దీక్షలో ఉద్రిక్తత
* విద్యార్థుల ఆత్మహత్యా యత్నం
వేదాయపాళెం, నవంబర్ 17: విక్రమ సింహపురి యూనివర్శిటీ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించి, కళాశాలను నూతన భవనంలోకి మార్చాలంటూ గత రెండు రోజులుగా ఏబివిపి ఆధ్వర్యంలో నగరంలోని విఆర్‌సి కూడలిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం ఉద్రిక్తంగా మారింది. ఎబివిపి విద్యార్థి సంఘం నాయకులతోపాటు వర్శిటీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విఆర్‌సి కూడలిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమించాలని కోరారు. దాంతో విద్యార్థులు వర్శిటి విసి తమకు హామీ ఇస్తేకాని తాము ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. దాంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. నగర డిఎస్పీ వెంకటరాముడు విఆర్‌సి కూడలికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించినా విద్యార్థులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. విసి, రిజిస్ట్రార్‌లు తమ సమస్యలను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా రాసిస్తేకాని ఆందోళనను వీడమని చెప్పడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి దీక్షకు దిగిన ఏబివిపి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
తమ సమస్యల పరిష్కారానికి దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని ఎబివిపి నాయకులు ధ్వజమెత్తారు. సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం ఆగేది లేదని నినాదాలు చేశారు. ఏబివిపి నాయకుడు ఒకరు పెట్రోలు బాటిల్ తీసుకొని పరుగులు తీస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి వర్శిటీ సమస్యను పరిష్కరించాలి లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని పెద్దగా నినాదాలు చేశాడు. మూడు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న ఏబివిపి విద్యార్థి నాయకుడు కౌషిక్ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతనిని జయభారత్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధకార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సురేంద్రలు దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. అప్పటికే విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఉండడంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై విద్యార్థి నాయకులను విడుదల చేశారు.
విసి హామీతో దీక్ష విరమణ
విక్రమ సింహపురి యూనివర్శిటి ఉపకులపతి ఆచార్య వి.వీరయ్య దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థి నాయకులతో మాట్లాడారు. నెల రోజుల్లో వర్శిటి కళాశాలను నూతన భవనాల్లోకి మారుస్తానని హామీ ఇచ్చారు. రిజిస్ట్రార్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ జరిపించాలని హెచ్‌ఆర్‌డి మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. మంత్రికి రాసిన లేఖను కూడా విద్యార్థి నాయకులకు అందిస్తామన్నారు. వర్శిటిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పడంతో ఏబివిపి విద్యార్థి నాయకులు దీక్షను విరమించారు. ఈ దీక్షాశిబిరంలో సాంబశివారెడ్డి, దారా వెంకటేశ్వర్లు, ఏబివిపి జాతీయ కార్యదర్శి పనకాల సురేష్, జగదీష్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

‘ఆర్టీసీ ఆన్‌లైన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి’
వేదాయపాళెం, నవంబర్ 17 : ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిటిఎం జి.సత్యనారాయణ కోరారు. నగరంలోని ఆర్టీసీ నెల్లూరు రీజియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణం చేయదలచుకున్న రూట్లలోని బస్సుల సమయాలు, చార్జీలు, సీట్ల ఖాళీలు ప్రయాణికులు ఈ యాప్ ద్వారా సునాయసంగా తెలుసుకోవచ్చన్నారు. ఆర్టీసీ సంస్థ గూగుల్ ద్వారా ఆర్టీసీ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. అలాగే తాము ఎక్కే బస్సుల వివరాలను సైతం తెలుసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ వాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ వాలెట్‌లో నమోదు చేసుకున్న వారికి రూ.100 జమ చేయబడుతుందని తెలిపారు. ఈ వాలెట్‌కు ఆన్‌లైన్ ద్వారా నగదు జమచేసి టిక్కెట్టు రిజర్వేషన్ సులభంగా చేసుకోవచ్చన్నారు. ఈ వాలెట్ ద్వారా టిక్కెట్టు బుక్ చేసుకున్న వారికి వారి ప్రయాణం పూర్తి అయిన తరువాత ప్రయాణం మొత్తంలో 10 శాతం (క్యాష్ బ్యాక్) ఈ వాలెట్‌లో జమ చేస్తారన్నారు. ఈ యాప్ ద్వారా రిజిర్వేషన్ చేసుకున్న బస్సు ఎక్కడ ఉన్నతి తర్వాత స్టాప్‌కు ఎప్పుడు వస్తుంది అనే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు ఎక్కడ ఉన్నది తరువాత ఎప్పుడు వస్తుందో మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఈ వాలెట్ యాప్‌ను ప్రయాణీకులు డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం పెద్దనోట్ల సమస్య తలెత్తడంతో రిజర్వేషన్ల కోసం వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాని ఈ వాలెట్ ద్వారా సులభంగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఆర్టీసి సంస్థ ఇస్తుందని ప్రతిఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నీరు-చెట్టు పథకంలో సోమిరెడ్డి దోపిడీ
ఎంఎల్‌సి సోమిరెడ్డిపై కాకాణి ఫైర్
మనుబోలు, నవంబర్ 18: నీరు-చెట్టు పథకం ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో చేసిన పనులలో ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామంలో సినీ నిర్మాత వల్లూరు పద్మనాభరెడ్డి నివాసంలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం కింద చేపడుతున్న పనులలో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని, రైతులే పనులు చేసుకుంటున్నారని సోమిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆ పథకం కింద చేపట్టిన పనులను రైతుల పేరు చెప్పి కాంట్రాక్టరు పనులు చేస్తు దోపిడి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నియోకవర్గంలో తనతో సోమిరెడ్డి వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు. నీరు-చెట్టు అవినీతిలో రాష్ట్రంలో సర్వేపల్లి నియోజవర్గం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. ఈ పథకం వలన రైతులకు ఒరిగిందేమీ లేదని, సోమిరెడ్డికి మాత్రం భారీస్థాయిలో కమీషన్లు ముట్టాయని ఆరోపించారు. నీరు-చెట్టు పనుల్లో అవినీతి జరుగుకుండా వుంటే అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఎందుకు ఆపారని ప్రశ్నించారు. వర్షాలు వచ్చిన తర్వాత చేసిన పనులు కనపడకుండా పోతాయని, అప్పుడు బిల్లులు చేసుకోవచ్చునన్న దురాలోచనతో చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిలో చంద్రబాబును మించిపోయారన్నారు. రుణమాఫీ జరుగలేదని తాము చెప్పినట్లుగా సోమిరెడ్డి జనచైతన్య యాత్రలలో చెపుతున్నారని, అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు బేషరతుగా రైతులకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ చేస్తామని, రూ.1.50 లక్షల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడాన్ని విమర్శిస్తున్నామన్నారు. సోమిరెడ్డి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు చెపుతున్నారని, గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ నాయకులు పచ్చిపాల జయరామిరెడ్డి, అడపాల శివకుమార్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌కుమార్‌రెడ్డి, దండు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సేద్యానికి విత్తంబేదీ?
పెద్ద నోట్ల రద్దుతో చిన్నబోతున్న రైతన్న
ఆత్మకూరు, నవంబర్ 17: కరెన్సీ కట కట ప్రభావం నెల్లూరు కర్షకులపై తీవ్రస్థాయిలో పడుతున్న వైనమిది. సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, ఐదువందల నోట్లను రద్దు చేయడం తెలిసిందే. అయితే అదే స్థాయిలో ఇతర నోట్ల అందుబాటులో కొరత నెలకొనడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నెల్లూరుజిల్లా రైతాంగంలో అధిక భాగం సేద్యం ప్రారంభమయ్యేది నవంబర్ మాసంలోనే కావడం గమనార్హం. ఇప్పుడిప్పుడే సోమశిల జలాల విడుదల తంతు కూడా ఆరంభమైంది. అలాగే బోర్ల కింద సాగు చేసే రైతులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సందర్భంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు నోట్ల రద్దు ప్రభావం గుదిబండగా మారుతోంది. చాలామంది రైతులు క్షేత్రస్థాయిన గ్రామీణ వాతావరంలో నెలకొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై ఆధారపడి సాగుబడి కార్యకలాపాలు కొనసాగిస్తుండటం పరిపాటి. సభ్యులైన రైతులందరికీ సహకార సంఘాలు బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తుండటాన్ని ఈ సందర్భంలో ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఆ సంఘాలన్నీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనుబంధంగా సేవలందిస్తుండటం ఆనవాయితీ. ఈక్రమంలో వ్యవసాయ పెట్టుబడి కోసం నగదు ఉపసంహరించుకుందామంటే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. అంతేగాక చాలా సహకార సంఘాల్లో చేతిలో నగదు స్వల్పంగా ఉంది. సాక్షాత్తు జిల్లా కేంద్ర బ్యాంక్ చైర్మన్ మెటుకూరు ధనుంజయరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం సహకార సంఘంలో చేతిలో ఉన్న నగదు కేవలం 6,500 రూపాయలు మాత్రమే. కాగా, రూ. 2వేల నోట్లు, వంద నోట్లు వంటివి సరఫరా అవుతున్న వైనంలో జాతీయ బ్యాంకులకు మాత్రమే ప్రాధాన్యత అధికం. ఇక వరుసలో సహకార బ్యాంకుల వంతు వచ్చే వరకు చాలా వెనుకబడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ బ్యాంక్‌ల బ్రాంచీలకే నిత్యం వస్తున్న నగదు సరిపడక జనం బారెడు వరుసల్లో చేదు అనుభవం ఎదుర్కొంటున్నారు. ఒకవేళ జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన ఖాతాదారులకు కూడా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిమితి కంటే తక్కువగానే అందరికీ సర్దుబాటు చేస్తున్నారు. వారం రోజుల వరకు ప్రకటించిన పరిమితుల్ని ప్రస్తావించుకుంటే రైతుల వెతలు అవగతమవుతాయి. వారానికి కేవలం 24వేల రూపాయలు మాత్రమే నగదు పొందాలని నిబంధలున్నాయి. నాలుగైదు ఎకరాలు సాగు చేసే రైతులకు పెట్టుబడిగా ఈ మొత్తం సరిపడదు. ఒకవేళ రైతుల వద్ద ఏటిఎం కార్డులు ఉండటంతో సహా ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఎందుకంటే జిల్లాలో ఏ పురుగుల మందు దుకాణంలోనూ ఏటిఎం కార్డుల ద్వారా నగదు స్వీకరించే స్వైపింగ్ యంత్రాలు లేవు. ఇక చేసేదేమి లేక పైపులు, మోటార్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం స్థానికంగా దుకాణదార్లను రుణం కోసమై వెంపర్లాడుతున్నారు. ప్రధానంగా అప్పు పద్ధతిలో అలుసుగా మారే రైతన్నలకు విత్తనాలు, ఎరువుల నాణ్యత ప్రమాణాలు లోపించినవే అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రైతులు తమ పొలాలకు వచ్చే వ్యవసాయ కూలీలకు ఏ రోజుకారోజు వేతనాలు ఇవ్వాలన్నా సమస్యగానే ఉంటోంది.

నగదు రహిత నిర్వహణపై
దృష్టిసారించాలి:కలెక్టర్

నెల్లూరు, నవంబర్ 17: నగదు రహిత నిర్వహణ (క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్) ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు బ్యాంక్ అధికారులు సంబంధిత యాజమాన్యాల సమన్వయంతో అవసరమైన ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక గోల్డెన్ జూబ్లీహాలులో నగదు పంపిణీ కార్యక్రమాలపై బ్యాంక్ అధికారులు, వాణిజ్య సంస్థలు, రైల్వే, ఆర్‌టిసి, గ్యాస్, ఆయిల్, మార్కెటింగ్ ఏజన్సీల సమన్వయంతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రధానంగా అవసరమైన పాస్ మిషన్స్‌ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఖాతాలు లేని వారికి కూడా రూపే కార్డులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో పోస్టుఆఫీసులు, రైల్వేస్టేషన్‌లు, చౌకధరల దుకాణాలు, మీ-సేవా కేంద్రాలు, పెట్రోల్‌బంకులు, వాణిజ్య కేంద్రాలు, పాలబూత్‌లలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత యాజమాన్యాల పరిధిలో అవసరమైన పాస్‌మిషన్స్‌ను వెంటనే ఏర్పాటుచేసి సామాన్య ప్రజానీకానికి నగదు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సెక్టార్ల పరిధిలో రవాణా, కూరగాయలు, నిత్యావసర సర్వీసులు తదితర ప్రజలకు అవసరమైన వస్తువుల పంపిణీలలో మొబైల్ కరెన్సీని ప్రోత్సహించి నగదు సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాలలో హుండీ ద్వారా వచ్చే నగదును వెంటనే వెలికితీసి బ్యాంక్‌లలో జమచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత నివేదికను అందించాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు కొనుగోలులో నగదు సమస్య లేకుండా వారి ఖాతాల నుండి తీసుకునే చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహించే లబ్ధిదారులకు నగదును పాత చిన్న నోట్లు బ్యాంకులో ఉన్నాయని, ఆ నోట్లను ఉపాధి హామీ కూలీలకు అందించేందుకు డ్వామా పిడి సమన్వయంతో పోస్టుఆఫీసులలో జమచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీల ప్రక్రియపై నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక అధికారులు, మండల అధికారులు సంబంధిత బ్యాంకు అధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమర్ధవంతంగా అమలుచేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులను అందించే రేషన్‌షాపులు, మీ-సేవా కేంద్రాలలో పాస్‌మిషన్స్ ఏర్పాటుకు సంబంధిత బ్యాంక్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మైక్రో ఎటిఎంలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, అదనపు ఎస్‌పి శరత్‌బాబు, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, జిల్లాస్థాయి అధికారులు, వివిధ వాణజ్య సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అత్యాచారం కేసులో నిందితుడికి ఐదేళ్లు జైలు
నెల్లూరు లీగల్, నవంబర్ 17: అభం శుభం తెలియని ఐదేళ్ల పాపపై పాశవికంగా అత్యాచారం చేసిన కేసులో నిందితుడు తుపాకుల దుర్గయ్యపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కె శ్యామలాదేవి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కోవూరు మండలం ఇనమడుగు గ్రామానికి చెందిన నిందితుడు తుపాకుల దుర్గయ్య వ్యవసాయ కూలీగా చేస్తూ జీవిస్తుండేవాడు. ఈయన మొదటి భార్య ఇతని వేధింపులు భరించలేక వదిలివెళ్లిపోయింది. దీంతో నిందితుడు దుర్గయ్య వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామానికి చెందిన లక్షమ్మ అనే ఇద్దరి బిడ్డల తల్లిని రెండో భార్యగా తెచ్చుకున్నాడు. ఈమెకు ఏడేళ్లు, ఐదేళ్ల ఇద్దరు పాపలు ఉన్నారు. నిందితుడి వేధింపులు భరించలేక ఆమె అప్పుడప్పుడు ఇళ్లు వదిలి వెళ్లిపోయేది. ఈ నేపథ్యంలో మార్చి 2, 2015న ఐదేళ్ల పాపను తీసుకొని నిందితుడు దుర్గయ్య సమీప పొలాల్లోకి వెళ్లాడు. వెళ్లిన అతను మరలా పాపతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఉదయానే్న ఇంటికి వచ్చిన తల్లి లక్షమ్మ తీవ్ర రక్తగాయాలతో ఉన్న పాపను చూసి అరుపులు కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి బాధితురాలైన ఐదేళ్ల పాపను విచారించగా, ఆ పాప నిందితుడు అర్ధరాత్రి సమీప పొలంలో తనపై చేసిన అత్యాచార సంఘటనను వివరించింది. దీనితో ఇరుగుపొరుగు వారు, తల్లి లక్షమ్మ సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంఘటనపై విచారించి అత్యాచారానికి గురైన పాపను వైద్యశాలకు తరలించారు. ఈమేర నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు.