శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కోర్టు ఆదేశాలను గౌరవిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జనవరి 7: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపించిన సర్వేపల్లి శాసనసభ్యుడు, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధనరెడ్డికి కోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేసిందని పోలీసులు శనివారం వెల్లడించారు. అయితే ప్రతిరోజూ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాపారు. అందులో భాగంగా శనివారం కాకాణి గోవర్ధనరెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు. అనంతరం కాకాణి విలేఖర్లతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవిస్తానని, పోలీసులు విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో అసలు వారిని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.

మోడల్ చెక్‌పోస్టుకు కొత్త టెండర్లు
ఆర్థిక శాఖ మంత్రి యనమల వెల్లడి
తడ, జనవరి 7: మండలంలోని భీములవారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో మోడల్ చెక్‌పోస్టు ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలవనున్నామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శనివారం ఆయన చెన్నై వెళుతూ తడ వద్దనున్న చెక్‌పోస్టు సమీపంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీ కేంద్రం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, అవి అధికంగా కోట్ చేయడం వల్ల పాత టెండర్లును రద్దు చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త టెండర్లు పిలవనున్నామని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టెండర్లు కోట్ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఒక్క టెండర్ కూడా నమోదు కాలేదన్నారు. తనిఖీ కేంద్రం మీదుగా అక్రమ వాహనాలు ఆగకుండా వెళితే కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొన్న నిర్ణయం వల్ల చెక్‌పోస్టు వద్ద ఆదాయం పెరిగిందన్నారు. తనిఖీ కేంద్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద ఆగకుండా తప్పించుకొని వెళితే వాటిపై దృష్టిసారిస్తామని, వాహనాలు పట్టుబడితే వాహన యజమానితో పాటు డ్రైవర్‌పై కూడా పోలీసు కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈయన వెంట ఎవో రవికుమార్, సిఐ విజయకృష్ణ ఉన్నారు.