శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బాస్ బాగున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 20: నేరాల నియంత్రణకు జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ ప్రవేశపెడుతున్న పథకాలను కిందిస్థాయి అధికారులు కొందరు తమ అక్రమార్జనకు అనుకూలంగా మలుచుకోవడంతో నెల్లూరు జిల్లాలో పోలీసు ప్రతిష్ట వీధుల్లోకి ఎక్కింది. సాక్షాత్తు ఐజి సంజయ్‌కుమార్ విచ్చలవిడి వసూళ్లకు పాల్పడుతున్న ఒక సిఐని ఇటీవల సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయినా కొందరు కిందిస్థాయి అధికారులు తమ పద్ధతిని మార్చుకోకపోగా, మరింతగా బరితెగించి షాపు యజమానులను, చిరువ్యాపారులను, లిక్కర్ సిండికేట్లను బెదిరించి వసూళ్లకు పాల్పడటం ప్రజానీకంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎస్‌పి విశాల్ గున్నీ నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిసి కెమేరాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకొన్న కొంత మంది సిబ్బంది వ్యాపార వర్గాలను, లిక్కర్ సిండికేట్‌లను, చిరు వ్యాపారులను బెదిరించి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఈ విషయం ఎస్‌పి దృష్టికి రాగా, అలా వ్యవహరించిన వారందరినీ ఆయన పిలిపించి మందలించి వసూలు చేసిన సొమ్ము తిరిగి వాపసు చేయించారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి నుండి చెక్కుల రూపంలోనే చందాలు స్వీకరించాలని సూచించారు. ఎస్‌పి బ్రేక్ వేసేందుకు ప్రయత్నించడంతో నగరంలోని పోలీసులు కొందరు పరోక్షంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో నగరంలో రాత్రి పూట గస్తీ నిర్వహణ, పగటి పూట నిఘా నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హత్యలు, దోపిడీలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నప్పటికీ పోలీసులు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంటే మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. నగరంలోని కీలక ప్రాంతాలలో ప్రధానంగా కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో గుట్కా వ్యాపారం, జీరో వ్యాపారం నిరాటకంగా సాగుతున్నా పోలీసులు ఆ వైపు కనె్నత్తి కూడా చూడటం లేదు. రాజకీయ పలుకుబడితో పోస్టులు దక్కించుకున్న కింది స్థాయి అధికారులు రాజకీయ నాయకులు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారు. ఏకపక్షంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలు సిఫారసులకు తల ఊపలేదనే కారణంగా ఇప్పటికి రెండు సంవత్సరాల్లో నలుగురు ఎస్‌పిలు బదిలీ అయ్యారు. గట్టిగా వెంటపడితే తనకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అనే భావనతో జిల్లా బాస్ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు పలువర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జోక్యం మితిమీరడం, అరాచక శక్తులు అధికార పార్టీల పంచన చేరడం, పోస్టింగులు కూడా రాజకీయ నేతల సిఫారసులతోనే జరగడం యధారాజ తథాప్రజా అన్నట్లు కిందిస్థాయి ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల సిఎం సమీప బంధువు ద్వారా సిఫారసు చేయించుకొని నెల్లూరుకు వచ్చిన ఒక అధికారి జోలికి వెళ్లేందుకు అధికారులు సైతం చాలా కాలం సాహసించలేదు. ఆ అధికారి నిర్వాహకం మరింత విచ్చలవిడి కావడంతో అతి కష్టం మీద అతనిపై చర్య తీసుకోకతప్పలేదు. రాజకీయ నాయకుల జోక్యం ఇదివరలో కొంతమేర ఉన్నప్పటికీ శాంతిభద్రతల విషయంలోనూ, అరాచకశక్తుల ఆగడాలను అరికట్టడంలోనూ ఉన్నతాధికారుల మాటే చెల్లుబాటు అయ్యేది. కిందిస్థాయి ఉద్యోగులు కూడా అందుకు తగ్గట్టుగానే పనిచేసేవారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా రాజకీయ నేతల కనుసన్నల్లోనే అంతా నడవడం ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేయాలన్న అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితి చూసి తమ శాఖ పనితీరుపట్ల ముక్కున వేలేసుకుంటున్నారు.

కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
నెల్లూరు, జనవరి 20: నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ వంతెన సమీపంలోని కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంతో 6వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 ఏళ్ల వయస్సు ఉంటుందని, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం నీటిలో కొట్టుకువచ్చి ఇక్కడ బయటపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి 6వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.