నెల్లూరు

ఎర్రకోటకు సలాం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంతో
అతిరథ మహారథుల ఆశయాల
ప్రజాస్వామ్యంలో
భిన్న సంస్కృతుల భారతావనిలో
సవరణల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలలో
నియమ నిబంధనలు కల్గిన
భారత రాజ్యాంగంలో
సమానత్వ భావనలతో నిండిన
ఈ మానవ సామ్రాజ్యంలో
తొలి స్వేచ్ఛా వాయువుల గణతంత్ర
భారతదేశంలో
బహుభాషల లౌకికతత్వం భారతీయుల
ఐకమత్యం
అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న
నవయువ భారతదేశమున నేడు
ఎక్కడున్నది స్వతంత్రం...
సిరిసంపదలదే స్వాతంత్య్రం
దిగజారిన దైవత్యం.. కుల మతాల
కుమ్ములాటతనం
మానవ మృగాల క్రూరత్వం..
విలాస వ్యసనాల సోమరితనం
పడకేసిన ప్రజాస్వామ్యం.. ప్రచరిల్లుతున్న
బడాస్వామ్యం
ప్రజాప్రతినిధుల హామీపత్రం... ఐదేళ్ళ గడువుకు ఆశల తాళపత్రం
బలవంతులు నాయకులై అందలం..
నిరుపేదలు తాకట్టుల అవతారం
వృత్తిని మరచిన బాధ్యతలు..
అవినీతి రహదారి పయనాలు
ఖద్దరు చాటున హోదా విలువలు..
పేదలకందని తియ్యని ఫలములు
నాటి ఆశయాలను మరిచిన నేటి
ప్రజాస్వామ్యమా
ఘనచరిత్ర గణతంత్ర భారతదేశంలో
ఇదేనా మన రాజ్యాంగ విధానం..
కోరుకున్నాం సమానత్వం
ఎప్పటికి మారుతుందో ఈ లోకం..
ఏనాటికి వస్తుందో సమసమాజం
స్వేచ్ఛా సమసమానత్వ గణతంత్ర భారతదేశ విలువలు కాపాడాలని
కోరుకుంటూ ఎర్రకోటకు సలాం..!

- హస్తి మోహన్‌రాజు,
చరవాణి : 8008511316
**

కబోర్డ్స్

కబోర్డ్స్ అందానికి ప్రతీకలు
అలంకరణకి మచ్చుతునకలు
ఏదైనా లోపలిని మూసివేసి
పైకి అందాన్ని చూపే పసందైన కబోర్డులు
మనుషులు కూడా
అంతేకదా
మనసులోని వికారాన్ని రూపంతో దాస్తారు
కుళ్లిన ఆలోచనల్ని
కుట్రలతో దాస్తారు
చిరునవ్వుల వెనుక
క్రూరత్వాన్ని దాస్తారు
సానుభూతి వెనుక
వెటకారాన్ని దాస్తారు
అభినందనల వెనుక
అసూయని దాస్తారు
ఓదార్పు వెనుక వారి
సంతృప్తిని దాస్తారు
అధికారం వెనుక
అవినీతిని దాస్తారు
మంచితనం వెనుక
మాయామర్మాలని దాస్తారు
లోపల ఏముందో తెలియక
పైకి అందంగా కనిపించే కబోర్డులు మనలో
చాలామంది మనుషులు..!

- ఎ.రేవతి
లైబ్రేరియన్, వెంకటాచలం
నెల్లూరుజిల్లా
చరవాణి : 7097452344
**

బుద్దుడు

గౌతమ బుద్దుడు
అర్ధరాత్రి
బాధ్యతలు
వదలిపోయాడు!
మనిషన్నాక-
దేహానికి,
రోగాలు బాధలుంటాయి!
ప్రతిది నశించిపోయే
ఈ విశ్వంలో
మానవ జీవితమెంత?
పుట్టిన ప్రతిజీవి
మరణించాల్సిందే!
శరీరమన్నాక
కోరికలుంటాయి!
జ్ఞానోదయం కోసం
రాజ్యాన్ని సరిచేయాల్సిన
రాజు
వనాలవెంట
తపస్సుకెళితే -
సమాజమేమవుతుంది?
విచక్షణ జ్ఞానం
కావాలి కాని
మా నాన్న
గౌతమబుద్దుడు కాడు!
ఎన్నికష్టాలు వచ్చినా
ఎన్ని
స్వార్థాలకు బలియైనా
కుటుంబం కోసం -
తపించాడు,
అమ్మకు జ్వరమొస్తే-
అమ్మకు అమ్మైనాడు
పిల్లల భవిష్యత్‌కు
తాను సంపాయించిన,
విత్తువిత్తంతో-
లోటులేని బాటవేశాడు!
నాన్న బుద్దుడిలా
జ్ఞాన సంపదకు
బాధ్యతలు మరచి
ఇల్లొదిలిపోలేదు!
చేతనయినంతలో
ఇరుగుపొరుగుకు
సహాయ సహకారాలిచ్చాడు
నాన్న గౌతమబుద్దుడంత
మహోన్నతమైన వ్యక్తి
కాకపోయిన
మానవత్వమున్న
మామూలు మనిషి!

- అనురాధ రామకృష్ణ
9394837563
**

అక్షరధార

అక్షరం మేధో శిఖరాగ్రం నుండి
అనంత భావ వాహినియై
కవితా జగతిలోకి ప్రవేశిస్తుంది
ప్రగతిపథ నిర్దేశం చేసే కవిత్వాన్ని సృష్టిస్తుంది
అక్షరం మట్టిబొమ్మలకు
మాటల ప్రాణం పోసి
చేతన కల్గించి మహనీయులుగా మారుస్తుంది
అక్షరం అంబుధరపై వర్షించి
కవితా క్షేత్రాలలో కొత్త పంటలు పండిస్తుంది
అక్షరం ఆనంద సంగీత తరంగమై
అభిమానుల హృదయాలను స్పృశించి అలరిస్తుంది

- చిల్లర సుబ్బారావు,
కందుకూరు
చరవాణి : 8187091455
**

అతను

అతను
ఒక
తండ్రి ఆశ
ఒక
తల్లి కోరిక
ఒక
సంస్థ తపన
ఒక
పిచ్చి క్రేజ్
ఒక
వెర్రి ఇమేజ్
అతనికి
లేని శక్తికి
అతన్ని
ప్రేరేపించింది
అతని
పిరికితనం
అతని
బలహీనత
అతని
ఒంటరితనం
అతనికందని తోడ్పాటు
అతన్ని తీరాన్ని
చేర్చలేకపోయింది
తట్టుకోలేని
అవమానం
అతని తనువుకు
చరమగీతం పాడింది
కన్నవారి ఊహాలోకం
మిగిల్చింది
కడుపుశోకం

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706
**

దేవతకు
ప్రతిరూపం

ప్రాణమైతే పోసింది కాని
అమ్మంటే తెలియదు నాకు
అమ్మ ప్రేమను
పొందలేకపోయా
నా జన్మకు కారణమైన
నాన్నంటే తెలియదు నాకు
నాన్న ఆప్యాయతకు
నోచుకోలేదు
ఆకలితో రోదిస్తే
ఊరుకోబెట్టి
వీధివీధి బిచ్చమెత్తి
నాల్గు మెతుకులు పెట్టేది
లోకమంటే తెలియని నాకు
అమ్మలా లాలించి
నన్ను ఎత్తుకు తిప్పింది
కథలెన్నో చెప్పింది
నాన్నలా నడిపించింది
అక్కలా బాధ్యతగా పెంచింది
చెల్లిలా గారాలు పోయింది
అన్నీతానై
నా కళ్లను తుడిచి
నాలోకం తనే అయ్యింది
నా తోబుట్టువులా
ఆప్యాయతానురాగాలు పంచింది
నన్నొక మనిషిగా చేసి
ఉన్నతస్థితికి తీసుకువచ్చిన ఆమెకు
ఏమిచ్చి ఋణం
తీర్చుకోగలను
కంటికి రెప్పలా ఆమెను
చూసుకోవడం తప్ప
ఎందుకంటే ఆమె దేవతకి
ప్రతిరూపం..!

- పి.కాశీవిశ్వనాధం
చరవాణి : 9494524445