శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చంద్రన్న బీమా మంచి పథకం:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చంద్రన్న బీమా పథకం మంచి పథకమని, దానిద్వారా లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో డిఆర్‌డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రన్న బీమా పథకంపై సమీక్షిస్తూ ఎన్ని దరఖాస్తులు నమోదయ్యాయి, ఏ రోజుకారోజు రిజిస్ట్రేషన్ అవుతున్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఏ రోజుకారోజు నివేదికలను సేకరించవలసిందిగా డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టరు లావణ్యవేణిని కోరారు. వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఏ రోజుకారోజు రిజిస్ట్రేషన్లు తక్కువ నమోదు చేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. క్లస్టర్‌వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పింఛన్లు విషయమై సమీక్షిస్తూ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో తీసుకున్న అర్జీలకు సంబంధించి ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పరిష్కరించబడలేదు, బ్యాంకు లింకేజి తదితరాలపై ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టరు లావణ్యవేణి, సంబంధిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో జింక మృతి
వెంకటాచలం, ఫిబ్రవరి 18 : కుక్కల దాడిలో గాయపడి జింక మృతి చెందిన సంఘటన మండలంలోని తిక్కవరప్పాడు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ జింక తాగునీటి కోసం తిక్కవరప్పాడు సమీపంలోకి వచ్చింది. జింక రాకను గుర్తించిన కుక్కలు జింకను వెంబడించి దాడి చేశాయి. ఈ విషయం గుర్తించిన స్థానికులు హుటాహుటిన వెళ్లి కుక్కల బారి నుంచి జింకను రక్షించారు. అయితే అప్పటికే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వచ్చి జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఖననం చేశారు.