శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

‘ఆరోగ్య రక్షతో కుటుంబానికి శ్రీరామ రక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, మార్చి 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించేందుకు కొత్తగా ప్రీమియంతో కూడిన ఆరోగ్య బీమా (ఆరోగ్య రక్ష) కోసం ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోవూరు తహశీల్దారు ముత్యం నరసింహులు కోరారు. శనివారం కోవూరు తహశీల్దారు కార్యాలయంలో ఆరోగ్య రక్ష పథకంపై జరిగిన సమావేశంలో పథకానికి సంబంధించిన వివరాలను తహశీల్దారు తెలియజేశారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం, పాత్రికేయ ఆరోగ్య సంరక్షణ పథకంలో నమోదు కానివారు పై రెండు పథకాలు వర్తించని వారికోసం ఏడాదికి రూ.1200 చెల్లించి రూ.2 లక్షల ఆరోగ్య బీమాను ఆరోగ్య రక్ష పథకం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఏప్రిల్ 6వ తేదిలోపు మీసేవా కేంద్రాలు, బిల్లు కలెక్టర్ల వద్ద ప్రీమియం చెల్లించవచ్చన్నారు. కుటుంబంలోని ప్రతిఒక్కరు విడివిడిగా ప్రీమియం తీసుకోవాలని వీలైనంత ఎక్కువ మందిని ఈ పథకం కిందకు తీసుకురావాలని ఆయన సిబ్బందిని సూచించారు. ఈ పథకంలో చేరిన వారికి 1044 వ్యాధులకు నెల్లూరులోని 18 కార్పొరేట్ వైద్యశాలల్లో, రాష్ట్రంలోని 410 కార్పొరేట్ వైద్యశాలల్లో ప్రైవేటు వార్డుల్లో చికిత్స, చికిత్సానంతరం వైద్యసేవలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఇఓపిఆర్‌డి శ్రీనివాసులు, ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, అనురాధ, విఆర్‌ఓలు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, ఆరోగ్యమిత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే’
గూడూరు, మార్చి 25: ప్రజలందరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జెవివి ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారుర. జబ్బులు లేకుండా ఆసుపత్రులకు పరిగెత్తి వేలాది రూపాయలు ప్రజలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు వీటిని నిర్లక్ష్యం చేయడంవల్ల సామాన్యుడికి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని అన్నారు. వ్యాధులు నయం చేసుకొనేందుకు పేదలు తాహతుకు మించి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు. ఈ విధానం మారాలని, ప్రతిఒక్కరికి వైద్యం ఉచితంగా లభించేటట్టు చూడాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించకుండా కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. ప్రతిఒక్కరికి ఆహారం కూడా అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రతిఒక్కరు బలవర్థకమైన ఆహారంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే జబ్బులు దరిచేరవని అన్నారు. ఈ విషయంలో కూడా ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. జబ్బు వచ్చిన తరువాత వేలాది రూపాయలు ఆసుపత్రులకు ధారపోసేకన్నా ఆరోగ్యంగా ఉండటం తెలుసుకోవాలన్నారు. ఈ సదస్సులో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు బాలకృష్ణారెడ్డి, లక్ష్మయ్య, వెంకటశేషారెడ్డి, ఎండివో భవానీ తదితరులు పాల్గొన్నారు.