శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

లక్ష్యాలను గడువులోగా పూర్తిచేయండి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మార్చి 25: నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ గడువులోగా లక్ష్యాలను సాధించాలని ఆదేశించినప్పటికి కొన్ని మండలాల్లో గృహనిర్మాణశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ పీడి రామచంద్రారెడ్డి జిల్లాలో గృహనిర్మాణశాఖలో జరిగిన పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు, డి ఇలు తదితరులు పాల్గొన్నారు.

ఓబిసికి చట్టబద్ధతపై బిజెపి నేతల హర్షం
నెల్లూరు టౌన్, మార్చి 25: ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఓబిసికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యేకంగా ఓబిసి కమీషన్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమని బిజెపి జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని బిజెపి కార్యాలయం నుంచి పూలే విగ్రహం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సురేంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బిసిలకు బిసి కమీషన్ ఏర్పాటుచేసి దేశ వ్యాప్తంగా చట్టబద్ధత కల్పించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదేనన్నారు. బిసిలు రాజకీయంగా ఎదిగేందుకు బిసి కమిషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం ఓబిసి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ, 60 ఏళ్లుగా బిసి కమీషన్‌ను ఏ ప్రభుత్వాలు కల్పించలేదని, అది బిజెపికే సాధ్యమైందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జిపి రోశయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్‌సి పెంచలయ్యలు మాట్లాడుతూ, ఓబిసి కమీషన్ వేసి ప్రతిపక్షాల నోటికి తాళం వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కప్పిర శ్రీనివాసులు, మారుబోయిన శ్రీనివాసులు గౌడ్, సమాధి శ్రీనివాసులు, కె వేణు, రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.