శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ పథకాల అమలులో అగ్రగామిగా నెల్లూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 26: ‘నేను జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే రోజు ఈ జిల్లాకు ఏం చేయగలను అని మంత్రి నారాయణను అడిగాను. చదువులో నెం.1గా ఉన్న మీరు జిల్లాను కూడా అన్ని రంగాల్లో నెం.1 చేయాలి అని ఆయన కోరారు. అదే లక్ష్యంతో పనిచేస్తున్నాను.’ అని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. ఆదివారం పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో జరిగిన ఆత్మగౌరవం అభినందన కార్యక్రమంలో ఆయన మంత్రి నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరును నిలపగలిగామని, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలోనూ జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉందన్నారు. రూ.308 కోట్ల ఖర్చుతో సుమారు కోటి 20 లక్షల పనిదినాలను కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో గృహనిర్మాణం విషయంలోనూ రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. 371 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించాలని లక్ష్యం నిర్దేశించుకోగా 365 భవనాల నిర్మాణం పూర్తయిందని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం లక్ష్యాన్ని చేరుకోవడంలో గణనీయమైన ప్రగతి సాధించామని గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 52 వేల మరుగుదొడ్లు నిర్మించగా ఈ 2016-17 ఆర్థిక ఏడాదిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2,34,890 మరుగుదొడ్లు నిర్మించామని, పట్టణ ప్రాంతాల్లో మరో 17,105 నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కేవలం కట్టి వదిలేయకుండా వాటిని నిర్మించుకున్న కుటుంబాల వారు తప్పనిసరిగా వాడాలని, తమ సిబ్బంది తరచూ తనిఖీలు చేసి వాడుతున్నదీ, లేనిదీ పరిశీలించడం కూడా జరుగుతోందన్నారు.
ఈ ఏడాది విద్య, వైద్యరంగాలపై దృష్టి
లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో 2017-18 ఆర్థిక ఏడాదిలో విద్య, వైద్యం, నగరపాలకం, రెవెన్యూ శాఖలపై దృష్టి సారించబోతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ శాఖల్లోనూ అమలయ్యే ప్రభుత్వ పథకాల విషయంలో, ప్రజలకు అందే సేవల విషయంలోనూ రాష్ట్రంలో మొదటి స్థానానికి జిల్లాను చేర్చడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈనెల 31న నెల్లూరు నగరంలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నగరంలో రూ.8 కోట్లతో నిర్మించే ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన, 2వేల మంది వృద్ధులకు వయోశ్రీ పథకం కింద అవసరమైన పరికరాల అందచేయనున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన జయంతి అనే మహిళ మరుగుదొడ్డి ఏర్పాటు తర్వాత తమ కుటుంబంలో వచ్చిన మార్పును సభలో తెలపడంతో అందరూ చప్పట్లతో అభినందించారు. అదేవిధంగా స్థానిక పాఠశాల విద్యార్థులు మరుగుదొడ్ల ఆవశ్యకతపై స్థానికులను చైతన్యపరిచేలా ప్రసంగించడం విశేషం. విరువూరు గ్రామ సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, జడ్పీ సిఇఓ వసుమతి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఆర్‌వి కృష్ణారెడ్డి, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఆత్మగౌరవం జిల్లా కో ఆర్డినేటర్ సుస్మితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోమిరెడ్డి జన్మదిన వేడుకలు
నెల్లూరు టౌన్, మార్చి 26: నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, కార్పొరేటర్ డాక్టర్ జడ్ శివప్రసాద్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మొదటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం కష్టపడి పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎప్పుడు ఏ సమస్యపై ఫోన్ చేసినా స్పందించి వారి సమస్యలు తీర్చడంలో ముందుంటారని ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి ఇంకెన్నో ఉన్నత పదవులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముంగమూరు కృష్ణారెడ్డి, కె కమలాకర్‌రెడ్డి, కావలి ఎఎంసి చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, దాసరి రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాట్నాలతో చేనేతల నిరసన
నెల్లూరు టౌన్, మార్చి 26: రాష్ట్రంలో చేనేతల ఆత్మగౌరవం దెబ్బతింటోందని, కులవృత్తులు నమ్ముకొని జీవించేవారు దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని, మగ్గాలను నమ్ముకుని జీవించే నేతన్నలకు మాత్రం ఆత్మహత్యలు తప్పడం లేదని ఆదివారం స్థానిక గాంధీబొమ్మ సెంటరులో చేనేతలు మగ్గాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేతలు మాట్లాడుతూ, చేనేత కార్మికులను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్టులో నామమాత్రపు నిధులతో అన్యాయం చేసిందన్నారు. ఆ నిధుల కొరతకు నేడు ఈ నిరసన తెలుపుతున్నామన్నారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటుచేసి కులవృత్తులను నమ్ముకున్న నేతన్నలకు ఆర్థిక భద్రత కల్పంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, ఉద్యోగులకు యూనిఫారం దుస్తులను ఆప్కో ద్వారానే అందిస్తామని 2005లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీ అమలుకావడం లేదని, అందుకే కోఆప్‌టెక్స్ లాభాల్లో ఉంటే ఆప్కో నష్టాల్లో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాజశేఖర్, చింతగింజల సుబ్బారావు, బుదాటి రాధయ్య తదితరులు పాల్గొన్నారు.

అన్నింటా కదలిక!
రూపుమారనున్న నియోజకవర్గాలు
జనాభా అనుసరించి భౌగోళిక మార్పు
ఆత్మకూరు, మార్చి 26: ‘‘ఆంధ్రప్రదేశ్ పునఃవిభజన సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపుతో నెల్లూరుజిల్లాలో కొత్తవి తెరపైకి రావడంతోపాటు పాత సెగ్మంట్లకు సంబంధించి కూడా మార్పులు, చేర్పులు అనివార్యమనే చెప్పాలి. నవ్యాంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుదలకు సంబంధించి భారత రాజ్యాంగ సవరణ చేయడం తప్పనిసరి తంతు కానుంది. అయితే భారత రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం నియోజకవర్గాల పునఃవిభజన చేపడతారు. గత డీలిమిటేషన్‌లో భాగంగా 2026 వరకు తిరిగి నియోజకవర్గాల్లో కదలికలు లేకుండా చేయాలనే నిబంధన పీటముడిగా ఉంది. మరోవైపు ఆ తరువాత చేసిన రాష్ట్ర పునఃవిభజన సందర్భంలో నియోజకవర్గాల పెంపుపై హామీ ఇచ్చారు. ఈక్రమంలో ముందుగా సగం మందైనా పార్లమెంట్ సభ్యుల హాజరు, అందులో 2/3వంతు సమ్మతితో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. అలా పార్లమెంట్‌లో నిర్వహించే సవరణతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో నూతనంగా నాలుగో క్లాజ్‌ను కూడా జతకలిపిన తరువాత మాత్రమే నియోజకవర్గాల పెంపుదల చేయవచ్చని వార్తలొస్తున్నాయి.’’
నెల్లూరుజిల్లాలో ఇప్పుడున్న 10 నియోజకవర్గాల స్థానే 13కు సంఖ్య పెరగవచ్చంటున్నారు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోనూ భౌగోళికంగా హద్దులు మారనున్నాయి. జనాభా సంఖ్యా బాహుళ్యం ప్రాతిపదికగా ఈ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అంతకుముందు డీలిమెటేషన్ వరకు నియోజకవర్గాల్లో పార్ట్‌మండలాల బెడద ఉండటాన్ని ఇదే సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. ఇద్దరేసి ముగ్గురేసి ఎమ్మెల్యేల పరిధి కలిగిన మండలాలు కూడా ఉండటం పరిపాటిగా ఉండేది. వివిధ శాఖల, మండల అధికార్లకు ఆయా స్థానిక ఎమ్మెల్యేలతో చిక్కులు వస్తుండేవి. గత డీలిమిటేషన్‌తో ఆ పరిస్థితుల్లేకుండా చేశారు. అయితే అప్పట్లో చాలా వరకు సంస్కరించినా రాష్ట్రం యూనిట్‌గా నియోజకవర్గాల సంఖ్య పెరగకపోవడంతో మరికొన్ని చిక్కులు వెంటాడుతూనే ఉండటం గమనార్హం. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలు ఉన్నాయి. అందులో ఐదు ఒకవైపుగా ఉంటే మరో మండలమైన చేజర్ల పెన్నానదికి దక్షిణం వైపున ఉంది. అలాగే కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాలుంటే అందులో నాలుగు ఓ వైపున, మరోటి ఇంకో పక్కగా ఉంది. ఇందుకూరు పేట మండలం పెన్నానదికి దక్షిణాన ఉండటంతో సమస్యలు నెలకొంటున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన కోవూరు నుంచి ఇందుకూరుపేట మండలానికి చేరుకోవాలంటే విధిగా నెల్లూరు నగరం మీదుగా రాకపోకలు సాగించాల్సిందే. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుదల జరుగుతున్న దృష్ట్యా కోవూరు నుంచి ఇందుకూరుపేటను విడగొట్టే అవకాశాలున్నాయి. అంతకుముందు డీలిమిటేషన్ వరకు కూడా కోవూరుతో ఇందుకూరుపేటకు సంబంధాలు లేవు. అప్పట్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేది. ఇప్పుడు నెల్లూరు నగర, గ్రామీణంతోపాటు మరో నియోజకవర్గాన్ని కూడా రూపొందిస్తారనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు గ్రామీణ మండలాన్ని ఆనుకుని ఉండే ఇందుకూరుపేటను ఇదే నియోజకవర్గ చెంతకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థలోని మొత్తం 54 డివిజన్లలో 31 సీటి నియోజవకర్గంలో, మిగిలిన 23 డివిజన్లతో సహా రూరల్ మండలం కలిపి గ్రామీణ నియోజకవర్గం ఉంది. ఈ రెండు సవరించడంతో సహా ఇందుకూరుపేట కూడా కలిపి మూడు నియోజకవర్గాలు చేయవచ్చని భావన. అలాగాక గ్రామీణ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండే ఇతర సెగ్మంట్లలోకి వచ్చే తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు ఇలా దేనిని కొత్తవాటిలో కలగలపాలని చూసినా మరో సమస్య వెంటాడే అవకాశాలుండేవి. నెల్లూరు గ్రామీణం ఆనుకుని ఉండే పై నాలుగు మండలాలు సర్వేపల్లి నియోజకవర్గంలో అంతర్భాగంగా కొనసాగుతున్నాయి. ఈ సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటరీ పరిధిలో ఉన్న దృష్ట్యా ఆ నాలుగు మండలాలను నెల్లూరు కొత్త సెగ్మంట్‌లోకి తీసుకురాబోరని చెప్పాలి. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి విడిపడే చేజర్లను రాపూరు సెగ్మంట్‌లోకి కలపవచ్చని ప్రచారం. ఇదిలాఉంటే కలువాయి మండలం వెంకటగిరి నియోజకవర్గంలో అంతర్భాగంగా ప్రస్తుతం కొనసాగుతోంది. నియోజకవర్గ కేంద్రమైన వెంకటగిరి పట్టణానికి, కలువాయికి ఆమడదూరం. అందువల్ల గతంలో కలువాయి భాగ మండలం ఉన్న రాపూరులోకి ఇప్పుడు పూర్తిగా విలీనం చేయవచ్చు. ఇలా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. సూళ్లూరుపేటను మాత్రం మార్చబోరనే వాదనలున్నాయి. ఎందుకంటే పారిశ్రామికంగా అనూహ్య అభివృద్ధి చెందుతోన్న ఈ నియోజకవర్గం మాత్రమే ప్రత్యేకంగా ఉండే నాయుడుపేట రెవెన్యూ డివిజన్ ఆవిర్భవించింది. కేవలం నాయుడుపేట రెవెన్యూ డివిజన్ మాత్రమే అంతర్భాగంగా ఉన్న సూళ్లూరుపేటలో కదలికలు ఉండబోవనే విశే్లషణలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిఎం పాత్ర ఉంది
* సమస్యను పక్కదారి పట్టిస్తున్న టిడిపి ప్రభుత్వం
* ఎమ్మెల్యే కాకాణి విమర్శ
వేదాయపాళెం, మార్చి 26: ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించినప్పుడల్లా ముఖ్యమంత్రి వేరే అంశాలను ప్రస్తావిస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని, ఇదంతా చూస్తుంటే ఇందులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు అర్ధమవుతోందని వైసిపి జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని మాగుంట లేఅవుట్‌లో గల వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బులు రాక పిల్లల పెళ్లిళ్లు నిలిచిపోయి చేసేదిలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా సిఎం మాట మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు జగన్మోహన్‌రెడ్డి పోరాటం చేస్తారని ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధితుల సాదకబాధలు తెలుసుకుని వారికి న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో కొందరు నాయకులు వారిని ప్రలోభాలకు గురిచేసి తక్కువ ధరలకు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం జప్తు చేసుకున్న ఆస్తులను మొత్తం వేలం వేసినా బాధితుల సమస్య కొంతమేరకు తీరుతుందన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. సీనియర్ ఐపిఎస్ అధికారిపై టిడిపి శాసనసభ్యులు దాడి చేసినా డిజిపి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. చిన్నపాటి సమస్య వచ్చినా ఆందోళన చేసే పోలీసు సంఘాలు ఎందుకు మిన్నకుండి పోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. అన్ని ఆధారాలతో సహా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విషయం అసెంబ్లీ ముందు ఉంచితే ఆ విషయాన్ని పక్కనపెట్టి వైసిపికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత ఆరోపణలు చేయించడం నీఛమైన రాజకీయంగా ప్రస్తావించారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలతోపాటు అధికార యంత్రాంగానికి కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో రూప్‌కుమార్ యాదవ్, వెంకటాచలం జడ్పీటిసి వెంకటశేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

‘రజకులను వంచిస్తున్న ప్రభుత్వాలు’
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 26: ఆర్థికంగా వెనుకబడిన రజకులకు చేయూతనందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంచనకు గురిచేస్తున్నాయని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మినీబైసాస్ రోడ్డులో ఉన్న సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన రజకులకు ఆర్థికంగా ఆదుకుంటామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయన్నారు. రజక ఫెడరేషన్‌కు 2013-14వ ఆర్థిక ఏడాదిలో 105 కోట్లు కేటాయించారన్నారు. అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం 89.14 కోట్లు కేటాయించి రజకులందరికీ ప్రభుత్వం లక్ష రూపాయలు, రజక ఫెడరేషన్ ద్వారా మరో లక్ష రుణాలుగా అందజేస్తామనటం హాస్యాస్పదమన్నారు. రాష్టవ్య్రాప్తంగా 30 లక్షల మంది రజకులున్నారని అరకొర కేటాయింపులు జరిపి రుణాలు అందజేస్తామని చెప్పటమంటే రజకులను వంచించటం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో 1555 రజక సొసైటీలుండగా, 20వేలకు పైగా వ్యక్తిగత రుణాలకు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం కేవలం 39 సంఘాలలోని 507 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసిందని అవి కూడా ఇప్పటికి అందక బ్యాంక్‌లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రజకుల సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించి వారి ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పొట్టేపాళెం చంద్రవౌళి, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గుంజి దయాకర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిలకపాటి సుబ్బారావు, కళ్లాతూరు రమణయ్య, పుల్లూరు మనోరమ, జువ్వలపూటి హుస్సేన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రలోభాలు, బెదిరింపులకు లొంగని ఓటర్లకు వందనం
సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు
అభినందన సభలో ఎమ్మెల్సీలు విఠపు, యండపల్లి స్పష్టం
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 26: సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం (జెవికె)లో ఆదివారం ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన వారికి వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విఠపు, యండపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పట్ట్భద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తమపై నమ్మకముంచి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలన్నారు. ఎన్నికలలో అధికార పక్షం ధన రాజకీయాలు చేసి ఓటర్లను అనేక ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడిందన్నారు. ఎంతో వ్యయంతో కూడిన ఎన్నికలలో సొంతంగా ఒక్క పైసా ఖర్చు కాకుండా ఎన్నికల్లో తమపై నమ్మకముంచి గెలిపించటం సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు, పట్ట్భద్రులు, వివిధ ప్రజా సంఘాలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము గెలవలేదని సమష్టి కృషితో విజయం సాధించామని ఇది సామాన్యుల విజయమన్నారు. అందరి సహకారంతో తాము తిరిగి రెండు, మూడు పర్యాయాలు ఎన్నికయ్యామన్నారు. అధికారంలో ఉన్నందువల్ల ఏంచేసినా చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వం భావించిందని విజ్ఞులైన ఓటర్లు విచక్షణతో ఓట్లు వేసి మండలికి ఎన్నిక చేశారన్నారు. సమస్యల పరిష్కారానికి ఇదేవిధంగా కలసికట్టుగా పోరాడదామన్నారు. ప్రజా సమస్యలపై దృష్టిసారించి శాసనమండలిలో ప్రజా గొంతుక వినిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు బాబురెడ్డి, సిపిఎం, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సిపిఐ నాయకులు రామరాజు, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, జనవిజ్ఞాన వేదిక, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఎం మోహన్‌రావు, ఎన్ నవకోటి, పి చంద్రవౌళి, దయాకర్, కిరణ్, నాయుడు రవి, నందకిరణ్, రెహనాబేగం, కె పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నేతలు తీరు మార్చుకోవాలి
టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద హితవు
నెల్లూరు టౌన్, మార్చి 26: ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా నాయకులు తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర హితవు పలికారు. విధ్వంసపూరితమైన పనులు చేస్తూ ప్రతి పనికి అడ్డుతగులుతూ అసెంబ్లీలో సైతం స్పీకరుపైకి దాడికి యత్నిస్తున్నారని వైకాపాపై ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా జిల్లా ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఉగాదికి ఒక ప్రత్యేకత సంతరించుకుందని, టిడిపి 35 సంవత్సరాలు పూర్తిచేసుకొని 36వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని తెలిపారు. అభిమానులందరు సంబరాలు చేసుకోడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ ప్రతిరోజు లోకేష్‌బాబుని, చంద్రబాబునాయుడిని తిడుతూ అసెంబ్లీ జరగకుండా గందరగోళాలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా తీరు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం మంత్రి నారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట అని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ నెల్లూరు జిల్లాలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో వాకాటి నారాయణరెడ్డి గెలుపు, పట్ట్భారామిరెడ్డి ఓటమికి, జిల్లా పార్టీదే సమష్టి బాధ్యత అని బీద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనురాధ, డాక్టర్ జెడ్ శివప్రసాద్, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.