శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నీరు-ప్రగతి కార్యక్రమాన్ని విద్యార్థులు పరిశీలించేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఏప్రిల్ 29: జిల్లాలో వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు తమ గ్రామాల్లో జరుగుతున్న నీరు - ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో నీరు-ప్రగతిపై ఇరిగేషన్, డ్వామా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం ఏర్పాటుచేసి ఆయా కళాశాలల్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల జాబితా, వారి స్వగ్రామాల జాబితా తయారుచేయించి వారికి వారి గ్రామాలలో నీరు- ప్రగతి కార్యక్రమాలు వేసవి సెలవుల్లో పరిశీలించే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఈ వేసవిలో ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో అక్కడ ఎక్కువగా పంట గుంటలు, సోక్‌పిట్స్, వర్షపు నీటిని నిల్వ ఉంచే కట్టడాలను వర్షాకాలం వచ్చులోపు పూర్తిచేయాలన్నారు. వర్షాలు పడిన తరువాత వర్షపునీరు నిల్వ ఉంచుటకు తీసిన నిర్మాణాలలో నీరు నిల్వ ఉండి తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య ఉండదన్నారు. కాబట్టి అధికారులు తప్పనిసరిగా ప్రస్తుతం నీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతున్న గ్రామాలలో వర్షపునీరు నిల్వ ఉంచు కట్టడాలు, అదేవిధంగా ప్రతి బోరింగ్ దగ్గర వర్షపునీరు నిలిచే విధంగా పిట్‌ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకి ఈ సంవత్సరం కేటాయించిన 16వేల పంటగుంటలు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీరు- ప్రగతి కింద ఇరిగేషన్ శాఖాధికారులు పనులకు పరిపాలనా పరమైన అనుమతులు తీసుకొని త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద వచ్చు కూలీల సంఖ్య పెరగడంతోపాటు వారికి ఇచ్చే వేతనం కూడా పెరగాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి హరిత, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

ఫోర్జరీ కేసులో నిందితుల అరెస్ట్
ఆత్మకూరు, ఏప్రిల్ 30: ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం గ్రామానికి చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు అనే వ్యక్తికి చెందిన స్థిరాస్థి డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం పూర్ణచంద్రరావు తెలిపారు. బాధితుడైన ప్రభాకర్‌నాయుడి ఆస్థిని ఫోర్జరీ సంతకాలతో కాజేసే ప్రయత్నాలతో సహా ఆయనకు చెందిన మామిడితోటలో చోరీ చేయడంపై, అతన్ని మానసికంగా హింసించడం, తదితర నేరారోపణలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో నిందితులుగా పట్ట్భా చౌదరి, జగదీష్‌నాయుడు, సందీప్, చంద్రశేఖర్, తదితరులు ఉన్నట్లు ఎస్సై వివరించారు.