శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉపాధి కోసం వెతుక్కోవడం కాదు.. స్వయంగా సృష్టించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఏప్రిల్ 29: నిరుద్యోగులైన యువత ఉపాధి కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ కాల హరణం చేసుకునేకన్నా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని, సృజనాత్మక ఆలోచనలతో నలుగురికీ ఉపాధి చూపే అవకాశాలను సృష్టించుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, రాజధాని కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు సూచించారు. శనివారం పట్టణంలోని ఎంఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో బిఎంఆర్ ఛారిటబుల్ ట్రస్టు, ఎంఎస్‌ఆర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా కార్యక్రమం ఏర్పాటుచేయగా, రాష్ట్ర డైరెక్టర్ చుక్కా వెంకయ్యతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాల కరస్పాండెంట్ రాజ్‌కుమార్ చౌదరి, కౌన్సిలర్ శ్రీదేవి చౌదరి కార్యక్రమ వివరాలు, కంపెనీల సమాచారాన్ని, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశాలను తెలియజేశారు. ఇందులో ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ చదువుకు తగిన నైపుణ్యాన్ని వృద్ధిచేసుకుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలను పొందే వీలుందన్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే స్వయంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురికి పనికల్పించే స్థాయికి ఎదగాలన్నారు.
పదేళ్లలో సింగపూర్‌ను మించి అభివృద్ధి: బీద
జిల్లా మరో పది పదిహేనేళ్లలో సింగపూర్‌ను మించి అభివృద్ధి సాధించగలదని రాజధాని కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు అన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక పారిశ్రామిక సంస్థలు వచ్చాయని, మేనకూరు, శ్రీసిటీ, కిసాన్ సెజ్, క్రిష్ణపట్నం పోర్టు, దగదర్తితో పాటు జిల్లాలో 21120 ఎకరాలలో ఎపిఐఐసి కారిడార్, ఎయిర్‌పోర్టు తదితర అనేక ప్రాజక్టులు వచ్చాయన్నారు. కొన్నిచోట్ల ఉత్పాదనలు కూడా మొదలుకాగా అంతర్జాతీయ సంస్థలు సైతం కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. తాను స్వయంగా 5వేల మంది ఉద్యోగులను కలిగిన్న బిఎంఆర్ గ్రూప్ కంపెనీలను నడుపుతున్నానని, ఆక్వా రంగంలో అంతులేని అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. తాను, నేటికాలంలో సానుకూల పరిస్థితులు, బ్యాంకుల ద్వారా ఆర్ధిక పరపతి, సమాచార సాంకేతిక రంగం ఇలా అనేక సానుకూల పరిస్థితులు ఉన్నాయని, స్టార్ట్ అప్ ఇండియా వంటి పథకాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు.
రూ. 6కోట్లతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం
కావలి పాలిటెక్నిక్ కళాశాలలో 6 కోట్ల రూపాయలతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకయ్య ప్రకటించారు. దీనిద్వారా వివిధ అంశాలలో అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి విద్యార్థుల్లో విజ్ఞాన వికాసానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి, రాజధాని కమిటీ సభ్యులు బీద ఆ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, అంగీకరిస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, అధికారులు అలేఖ్య, భరత్‌కుమార్, అమరావేదగిరి గుప్తా, పోట్లూరి శ్రీనివాసులు, కనుమర్లపూడి నారాయణ, దేవరాల సుబ్రహ్మణ్యం, దామిశెట్టి సుధీర్‌నాయుడు, లోకనాధం, సురేష్‌కుమార్‌తో పాటు పలువురు హాజరయ్యారు.
ఉద్యోగ ఎంపికలకు 23 కంపెనీలు హాజరు
ఉద్యోగ ఎంపికలకు 23 కంపెనీలు హాజరుకాగా ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు మూడు వేలమంది నిరుద్యోగులు హాజరై తమ బయోడేటాను అందజేశారు. పరిశీలన, ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత అర్హులకు నియామక ఉత్తర్వులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.