శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైద్యుల పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, అక్టోబర్ 15 : కోటలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వైద్యశాలకు రాగానే వైద్యశాలలోని పలు వార్డులను పరిశీలించారు. ఆ సమయంలో ల్యాబ్‌కు తాళాలు వేసి ఉండటం, వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే బయోమెట్రిక్ ద్వారా వైద్యసిబ్బంది హాజరును పరిశీలించారు. అందులో ఒక డాక్టర్ విధులకు గైర్హాజరై ఉండటంతో, డాక్టర్ విధులకు ఎందుకు రాలేదని ప్రశ్నించగా, సెలవు ఉండటంతో విధులకు రాలేదని తోటి వైద్యులు తెలిపారు. అలాగే గర్భిణుల రిజిస్టర్‌ను పరిశీలించగా నెలకు సుమారు 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు రిజిస్టర్‌లో ఉండటంతో వారు ప్రభుత్వ వైద్యశాలలో ఎందుకు కాన్పులు చేయించుకోవడం లేదు, వారికి మీరు అవగాహన కల్పించలేదా అని వైద్యులను ప్రశ్నించారు. ఓపి రిజిస్టర్లు రెండు ఉండటంతో ఏది అసలో, ఏది నకిలీదో తెలియక కలెక్టర్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు రిజిస్టర్లు వాడటం మంచిపద్ధతి కాదన్నారు. జననీ సురక్ష పథకం ద్వారా లబ్ధి పొందిన వారి ఆధార్, ఫోన్ నెంబర్లు నమోదు చేయకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జననీ సురక్ష పథకం ద్వారా బాలింతలకు భోజన వసతి కల్పిస్తున్నారా లేదా అని ఆయన వైద్యులను ప్రశ్నించగా, భోజనం కోసం రూ.100 చెల్లిస్తున్నామని డాక్టర్ రవికుమార్ తెలిపారు. జననీ సురక్ష పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక మహిళకు కలెక్టర్ ఫోన్ చేయగా తాము వైద్యశాలలో మూడు రోజులపాటు ఉంటే ఒక్కరోజు మాత్రమే రూ.100 ఇచ్చారని, డిశ్చార్జి అయ్యే సమయంలో మందులు రాసిచ్చి బయట తెచ్చుకోమన్నారని చెప్పడంతో కలెక్టర్ వైద్యుల పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్న దృష్ట్యా గ్రామాల్లో పర్యటించి వారికి సరైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు సరైన వైద్యం అందించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి వరసుందరం, జిల్లా పరిషత్ సిఇవో సుబ్రహ్మణ్యం, గూడూరు ఆర్‌డివో అరుణ్‌బాబు, డిపివో శ్రీహరి తదితరులు ఉన్నారు.

తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ
మనుబోలు, అక్టోబర్ 15 : ఇంటికి తాళం వేసి బంధువుల కర్మకాండలకు వెళ్లి తిరిగి ఇంటి వచ్చే సరికి బీరువాలో ఐదు సవర్ల బంగారు నగలు, 400 గ్రాములు వెండి వస్తువులు చోరీకి గురైన సంఘటన శనివారం సాయంత్రం మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన నీలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అతని భార్య శనివారం ఇంటికి తాళం వేసి, బాత్‌రూంలో తాళం చెవిని పెట్టారు. మండల పరిధిలోని బద్దెవోలు గ్రామంలో బంధువుల ఇంట్లో కర్మకాండలకు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. వెంటనే బీరువాను తెరిచి చూడగా అందులో ఉండాల్సిన ఐదు సవర్లు బంగారు నగలు, 400 గ్రాములు వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీకి జరిగినట్లు నిర్ధారించుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో గూడూరు రూరల్ సిఐ అక్కేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి చోరీ జరిగిన ఇంటిని, బీరువాను పరిశీలించారు. నెల్లూరు నుంచి క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. ఇంటి తాళం పగులగొట్టకుండా తాళం చెవి బాత్‌రూంలోనే ఉండిందని బాధితులు తెలపడంతో తెలిసిన వ్యక్తి చోరికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.