శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేతన్నకు చేయూతనివ్వండి:ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, అక్టోబర్ 15: అనేక అవస్థలు పడుతున్న చేనేత కార్మికులకు సహాయం అందించాలని నెల్లూరు శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి అన్నారు. ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’లో భాగంగా ఆదివారం సౌత్‌మోపూర్ గ్రామంలో ప్రజాబాట నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల కుటుంబాలు ఆర్థిక పరిస్థితి బాగాలేక బయట నుండి ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకొని నేత పనులు చేస్తున్నారని, దానివల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే తప్ప ఎలాంటి మిగులు ఆదాయం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలలో చేనేత కుటుంబాలకు సిల్కు, నూలు తదితర ముడిసరుకుపై సబ్సిడీ కింద చేయూత అందిస్తున్నాయని అయితే మన రాష్ట్రంలో అలాంటి కార్యక్రమం లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలకు నేత నేయడానికి షెడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని, నివాసం ఉంటున్న చిన్న ఇళ్లల్లోనే మగ్గాలతో నేసుకోవడం వలన ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అందువల్ల అందరికీ పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.