శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మహిళాభ్యున్నతితోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, డిసెంబర్ 11 : మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గ అధ్యక్షురాలు పి శాంతి అధ్యక్షతన తెలుగు మహిళ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా విజయాడెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర నియోజకవర్గ ఇన్‌చార్జి ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆనాడే ఆస్తిలో మహిళలకు వాటా వచ్చేవిధంగా జీవోను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నేడు ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకుని సిఎం చంద్రబాబునాయుడు మహిళల అభ్యున్నతికి పొదుపుగ్రూపులను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వారు విద్య, వ్యాపార రంగంలో అభివృద్ధిలో ఉన్నప్పుడే వారి వారి కుటుంబాలే కాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో వారికి వ్యాపారాలకు దాదాపు 50లక్షల వరకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ఆడపిల్లల పెళ్లిల కోసం పెళ్లి పందిరిలోనే 30వేల రూపాయలను అందించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నేడు సమాజంలో విద్యలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పోటీపడినందుకు తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చంద్రన్నకానుకలు, చంద్రన్నబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. నేడు వారి కోసం ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ప్రొక్లెయినర్‌లు అందించి కాంట్రాక్టు రంగంలో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్న ఘనత సిఎం చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఇలాంటి అనేక పథకాలను చంద్రబాబునాయుడు ప్రవేశపెడుతున్నారని ప్రతి ఒక్క మహిళ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లినప్పుడే మహిళలు ఆ పథకాలను అందుకోగలరని తెలిపారు. రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలంటే ఈ పథకాలను ప్రతిఒక్కరికీ తెలియజేసేవిధంగా కృషి చేయాలని పొదుపు మహిళలను, తెలుగుమహిళా కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ముప్పాళ్ల విజేత, ధర్మవరపు సుబ్బారావు, కార్పొరేటర్లు బొల్లినేని శ్రీవిద్య, వహీదా, మేకల రజని, అంచూరు జానకి, ఝాన్సి, పి రజనీచక్రపాణి, పునబాక భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నరకానికి నకళ్లు.. కాలనీ రహదారులు
*ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం
నెల్లూరు రూరల్, డిసెంబర్ 11: నియోజకవర్గంలోని పలు కాలనీ రోడ్లు నరకానికి నకళ్లుగా తయారయ్యాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన వూరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 73వ రోజు అయిన సోమవారం 24వ డివిజన్‌లోని సుందరయ్య కాలనీ, వౌర్యనగర్, ఆటోనగర్, చలపతినగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య కాలనీ, ఎ, బి బ్లాక్‌ల రోడ్లు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు నీటి పైపుల కోసం తవ్విన గుంటలు వాటికి తోడవ్వడంతో ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇంట్లో నుంచి బయటకురావడానికే వసతి లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అయినా ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు పబ్లిక్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోవడం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్య ధోరణిలో ఉన్న అధికారులకు తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొంతమంది అధికారులు సమస్యలు తెలిపిన వెంటనే స్పందిస్తున్నారని, అలాంటి అధికారులను తాము గుండెల్లో పెట్టుకుంటామని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారి పట్ల పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన అన్నారు. రహదారుల సమస్యలపై అధికారులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో రహదారుల సమస్య పరిష్కారం కానిపక్షంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఉద్యమం చేయనున్నట్లు ఆయన తెలిపారు.