శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శబరి క్షేత్రంలో పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 25: దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రంలో సోమవారం సాయంత్రం స్వామివారికి పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

వైభవంగా ఈశ్వరయ్య స్వామి తిరునాళ్లు
పోటెత్తిన భక్తజనం
డక్కిలి, ఏప్రిల్ 25: మండలంలోని దేవునివెలంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ స్తంభాలగిరి ఈశ్వరస్వామి తిరునాళ్ల మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల శివనామస్మరణతో దేవునివెలంపల్లి మారుమోగింది. తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. ఈ తిరునాళ్లకు జిల్లా నుండే కాకుండా కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాపయ్య స్వామి సమాధి వద్ద భక్తులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా శివపార్వతులకు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. నూతనంగా నిర్మించిన పార్వతీ ఆలయంలో అమ్మవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. గిరిజన సంప్రదాయం ప్రకారం పొందు సేవ నిర్వహించారు. మిట్ట వడ్డిపల్లికి చెందిన కలకంటి రామారావు బ్రదర్స్ 15 వేల మందికి అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రతను కూడా భక్తులు లెక్కచేయకుండా పసిబిడ్డలతో కలసి ఆలయం వద్దకు చేరుకొన్నారు. ఈ తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొనకుండా గూడూరు డిఎస్పీ శ్రీనివాస్, వెంకటగిరి సిఐ శ్రీనివాసరావు, డక్కిలి ఎస్సై జిలానీ తమ సిబ్బందితో కలసి పర్యవేక్షించారు. డక్కిలి విద్యుత్ ఎఇ జహీర్ అహ్మద్ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యశిబిరం నిర్వహించారు.

గంజాయి విక్రేత అరెస్ట్
10 కేజీల గంజాయి స్వాధీనం
గూడూరు, ఏప్రిల్ 25: గూడూరు అరుంధతీయవాడకు చెందిన తుమ్మూరు వెంకటరమణయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 50 వేల రూపాయల విలువ చేసే పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఒకటవ పట్టణ ఎస్సై దశరథరామారావు తెలిపారు. నర్సీపట్నం తదితర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ వాటిని చిన్నచిన్న పొట్లాలు చేసి విక్రయిస్తుండేవాడు. తమకందిన సమాచారం మేరకు అతనిపై నిఘా ఉంచడంతో సోమవారం అతనిని పట్టణంలోని పిఎస్‌ఆర్ పార్కు వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతనిని కోర్టుకు హాజరుపరిచినట్టు ఆయన తెలిపారు.