శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రంగనాథుని బ్రహ్మోత్సవాలకు వేళాయెరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 23 : పవిత్ర పినాకినీ నది తీరాన వెలసిన శ్రీతల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం జరిగే అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. స్కంధ పురాణంలోనే తల్పగిరి మహత్యం గురించి ప్రస్తుతించినట్లు శాసనాలు చెప్తున్నాయి. శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారం చేయతలచి ఈ తీరాన్ని వేదికగా చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషునిపై సేదతీరుతూ ఈ దేవాలయంలో శ్రీమహావిష్ణువు రంగనాథస్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈయనను శయన నారాయణుడని భక్తులు కీర్తిస్తుంటారు. పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రానికి ఉత్తర శ్రీరంగమనే పేరు కూడా ఈ ఆలయానికి ఉంది. తొలుత శ్రీవైకుంఠం, శయన నారాయణుడనే పేర్లతో పిలవబడిన ఈ ప్రాంతం 17, 18వ శతాబ్ధాల్లో తల్పగిరి శ్రీరంగనాథునిగా పిలవబడుతున్నట్లు ఆలయ చరిత్ర ద్వారా బహిర్గతమవుతోంది. కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి మహాభారతాన్ని తెలుగులో రచించిన పుణ్యక్షేత్రమిది.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం జరిగే అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 7వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి శేషవాహన సేవ, ఈ నెల 27న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి హంసవానసేవ జరగనున్నాయి. 28న నుదయం సింహవాహన, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ, మార్చి 1న ఉదయం పల్లకిసేవ, రాత్రికి హనుమంతసేవ, 2న ఉదయం మోహినీ అవతారం, రాత్రికి బంగారు గరుడసేవ, అదే రోజు ఆలయంలో ప్రత్యేక పూలంగిసేవ కూడా జరుగుతుంది. 3న శనివారం ఉదయం పూలంగిసేవ, సాయంత్రం స్వామివారికి కల్యాణోత్సవం, 4న ఉదయం రథోత్సవం, రాత్రికి పొన్న వాహనోత్సవం, 5న మధ్యాహ్నం తిరుప్పాయ్‌నాడల్, సాయంత్రం అశ్వవాహనసేవ, 6న ఉదయం ప్రణయ కలహోత్సవం, చక్రస్నానం, సాయంత్రం పుణ్యకోటి విమానసేవ జరగనుంది. 7న సాయంత్రం పుష్పయాగం, రాత్రికి దవనోత్సవం, అదేరోజు రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ సేవ, 8న స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి
స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులద్దడంతో పాటు విద్యుద్దీపకాంతులతో మిరుమిట్లుగొలిపేలా అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున ఎటువంటి పొరపాట్లు, భక్తులకు అసంతృప్తి జరగకుండా పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు తన అభిమాన నందమూరి కుటుంబీకులకు హైదరాబాద్ వెళ్లి ఆహ్వానపత్రాలు అందచేశారు.